ఫన్‌ ఫిల్డ్ ఎంటర్‌టైనర్‌ అంటోన్న రాజమౌళి.. గాలి సంపత్‌ ట్రైలర్‌

Published : Feb 27, 2021, 12:10 PM IST
ఫన్‌ ఫిల్డ్ ఎంటర్‌టైనర్‌ అంటోన్న రాజమౌళి.. గాలి సంపత్‌ ట్రైలర్‌

సారాంశం

శ్రీవిష్ణు హీరోగా రాజేంద్రప్రసాద్‌ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం `గాలి సంపత్‌`. దర్శకుడు అనిల్‌ రావిపూడి దర్శకత్వం పర్యవేక్షణలో అనిశ్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ఎస్‌.కృష్ణ నిర్మిస్తున్నారు. లవ్లీ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. తాజాగా శనివారం ఈ చిత్ర ట్రైలర్‌ని దర్శకధీరుడు రాజమౌళి విడుదల చేశారు.

శ్రీవిష్ణు హీరోగా రాజేంద్రప్రసాద్‌ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం `గాలి సంపత్‌`. దర్శకుడు అనిల్‌ రావిపూడి దర్శకత్వం పర్యవేక్షణలో అనిశ్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ఎస్‌.కృష్ణ నిర్మిస్తున్నారు. లవ్లీ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. తాజాగా శనివారం ఈ చిత్ర ట్రైలర్‌ని విడుదల చేశారు. దర్శకధీరుడు రాజమౌళి ఈ చిత్ర ట్రైలర్‌ ట్విట్టర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. 

ట్రైలర్‌లోని రాజేంద్రప్రసాద్‌ `ఫా `లాంగ్వేజ్‌లో మాట్లాడుతుంటారు. అదే ఫా లాంగ్వేజ్‌తో `ఫా ఫా ఫా.. ఫన్‌ ఫిల్డ్ ఎంటర్‌టైనర్‌` అంటూ ట్రైలర్‌ని విడుదల చేశారు రాజమౌళి. ఆద్యంతం కామెడీగా సాగే ట్రైలర్‌ ఆకట్టుకుంటుంది. చివరి తండ్రి కొడుకుల మధ్య ఎమోషనల్‌, వారి బాండింగ్‌ ఇంట్రెస్ట్ ని క్రియేట్‌ చేస్తున్నాయి. `ప్రపంచంలో ఏ తండ్రైనా తన కొడుకు తనకంటే నాలుగు మెట్లు ఎదగాలని చూస్తాడు. నువ్వేంటి నాన్న నన్ను తొక్కి నువ్వు ఎదగాలని చూస్తున్నావ్‌` అని శ్రీవిష్ణు చెప్పే డైలాగ్‌ ఆసక్తిని క్రియేట్‌ చేస్తుంది. ఈ సినిమా మార్చి 11న విడుదల కానుంది. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌
Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌