కంగనా రనౌత్‌తో వివాదం.. నేడు కోర్ట్ ముందుకు హృతిక్‌ రోషన్‌

Published : Feb 27, 2021, 08:31 AM IST
కంగనా రనౌత్‌తో వివాదం.. నేడు కోర్ట్ ముందుకు హృతిక్‌ రోషన్‌

సారాంశం

హృతిక్‌, కంగనాల మధ్య 2016 నుంచి కేసు నడుస్తుంది. వీరిద్దరి మధ్య గతంలో లవ్‌ ఎఫైర్‌ ఉన్నట్టు వార్తలొచ్చాయి. ఓ టీవీ ఛానెల్‌ ఇంటర్వ్యూలో కంగనా ఇదే విషయం చెప్పింది. తామిద్దరం రిలేషన్‌లో ఉన్నామని, ఆ తర్వాత విడిపోయినట్టు చెప్పింది. దీనిపై హృతిక్‌ స్పందించారు.

హృతిక్‌ రోషన్‌, బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ ల ఈ మెయిల్‌ కేసు ఇంకా కొనసాగుతూనే ఉంది. దాదాపు ఐదేళ్లుగా ఇది కోర్ట్ లు, క్రైమ్‌ బ్రాంచ్‌ల చుట్టూ తిరుగుతుంది. తాజాగా కోర్ట్ కి హాజరు కావాలని ముంబయి క్రైమ్‌ ఇంటలిజెన్స్ డిపార్ట్ మెంట్‌ హృతిక్‌కి శుక్రవారం సమన్లు జారీ చేసింది. నేడు(ఫిబ్రవరి 27)న కోర్ట్ ముందు హృతిక్‌ స్టేట్‌మెంట్‌ని రికార్డ్ చేయనున్నట్టు తెలిపింది. ఈ మేరకు హృతిక్‌ నేడు కోర్ట్ ముందు హాజరు కానున్నారు.

హృతిక్‌, కంగనాల మధ్య 2016 నుంచి కేసు నడుస్తుంది. వీరిద్దరి మధ్య గతంలో లవ్‌ ఎఫైర్‌ ఉన్నట్టు వార్తలొచ్చాయి. ఓ టీవీ ఛానెల్‌ ఇంటర్వ్యూలో కంగనా ఇదే విషయం చెప్పింది. తామిద్దరం రిలేషన్‌లో ఉన్నామని, ఆ తర్వాత విడిపోయినట్టు చెప్పింది. దీనిపై హృతిక్‌ స్పందించారు. కంగనా తనపై ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడంపై ఆయన ఫైర్‌ అయ్యారు. కంగనాపై కేసు పెట్టాడు. ఈ క్రమంలో వీరి మధ్య ఈమెయిల్‌ భాగోతం బయటపడింది. కంగనా ఈ విషయాన్ని వెల్లడించింది. దీన్ని మరింత సీరియస్‌గా తీసుకున్న హృతిక్‌ ఈ కేసు విషయంలో ఆయన ముందుకెళ్లారు. ముంబై పోలీసుల చేతిలో నుంచి క్రైం ఇంటలిజెన్స్ యూనిట్ ఆఫ్ ముంబై పోలీస్ క్రైం బ్రాంచ్‌కి షిఫ్ట్ చేయించారు హృతిక్‌. 

ఇటీవల వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్న కంగనా ప్రస్తుతం `తలైవి`, `దాఖడ్‌`తోపాటు `తేజాస్‌` అనే చిత్రంలో నటిస్తుంది. మరోవైపు హృతిక్‌ `ఫైటర్‌`, `క్రిష్‌ 4` చేస్తున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode: వైరాతో చేతులు కలిపిన జ్యోత్స్న- శ్రీధర్ ని కార్తీక్ కాపాడుతాడా?
Bigg Boss Telugu 9 విన్నర్‌లో మార్పు.. ఆడియెన్స్ ఓటింగ్‌తో పనిలేదా? అంతా వీళ్లదే నిర్ణయం