#1770: రాజమౌళి శిష్యుడి డైరక్షన్ లో భారీ చరిత్రాత్మక చిత్రం

By Surya PrakashFirst Published Aug 17, 2022, 2:18 PM IST
Highlights

‘ చాలా ఏళ్ల క్రితమే నేను ‘ఆనంద్‌మఠ్‌’ నవల చదివాను. ఆ నవలను సినిమాగా తీయాలనుకుంటున్నామనీ, మీరు రచన చేయాలని చిత్రనిర్మాతల్లో ఒకరైన సూరజ్‌ అడగ్గానే, నేను ఒక అడుగు వెనక్కి వేశాను. ఎందుకంటే ఇప్పటి జనరేషన్‌కు ఈ కథ కనెక్ట్‌ కావడం కష్టం. అదే విషయం ఆయనకు చెప్పాను. అయితే ...


మనకు ఉన్న అతి కొద్ది మంది స్టార్ రైటర్స్ లో విజయేంద్రప్రసాద్ ఒకరు. దేశంలో భారీ నేపథ్యమున్న చిత్రాలు, అతి పెద్ద కథాంశాలను సినిమాగా తెరకెక్కించాలంటే కనిపిస్తున్న  విజయేంద్ర ప్రసాద్‌ నే ఎంచుకుంటారు. ‘బాహుబలి’, ‘బజరంగీ భాయిజాన్’, ‘మణికర్ణిక’, ‘ఆర్‌ఆర్ఆర్‌’ అంటూ తనదైన స్టైల్ లో కథలు అందించి మెప్పించారు విజయేంద్ర ప్రసాద్‌. ఇప్పుడు ఆయన చేతిలో ‘సీత’, మహేష్‌, రాజమౌళి వంటి భారీ చిత్రాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి  మరో కథ కూడా చేరింది . ఇది కూడా ఎపిక్‌ స్టోరీ అవటం విశేషం.

ప్రముఖ ఫిలింమేకర్ రామ్ కమల్ ముఖర్జీ మరియు జి స్టూడియోస్ మాజీ హెడ్ సుజయ్ కుట్టి కలిసి "1770: ఎక్ సంగ్రాం" అనే టైటిల్ తో ఈ చిత్రం తెరకెక్కించనున్నారు.  బంకించంద్ర చటర్జీ రచన ఆనంద్ మఠ్ ఆధారంగా ఈ  సినిమాని ప్రకటించారు. ఇప్పటికే ఆయన స్క్రిప్ట్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని దర్శక దిగ్గజం రాజమౌళి శిష్యుడు అశ్విన్ గంగరాజు డైరక్ట్ చేయనున్నారు. అశ్విన్ గంగరాజు గతంలో ఆకాశవాణి అనే చిత్రాన్ని డైరక్ట్ చేసిన సంగతి తెలిసిందే. 

 1770లో భారతదేశ చరిత్రలో జరిగిన ఓ అపురూప ఘట్టానికి దృశ్య రూపం ఇవ్వనున్నారు. హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడతో పాటు బెంగాలీలో కూడా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ప్రముఖ రచయిత బంకిం చంద్ర చటర్జీ రాసిన ఆనందమఠ్ నవల ఆధారంగా కథను తయారుచేశారు. శైలేంద్ర కకుమార్, సుజయ్ కుట్టి, క్రిష్ణ కుమార్, సూరజ్ శర్మ తదితరులు ఈ ప్రాజెక్టులో భాగం కానున్నారు.

‘ చాలా ఏళ్ల క్రితమే నేను ‘ఆనంద్‌మఠ్‌’ నవల చదివాను. ఆ నవలను సినిమాగా తీయాలనుకుంటున్నామనీ, మీరు రచన చేయాలని చిత్రనిర్మాతల్లో ఒకరైన సూరజ్‌ అడగ్గానే, నేను ఒక అడుగు వెనక్కి వేశాను. ఎందుకంటే ఇప్పటి జనరేషన్‌కు ఈ కథ కనెక్ట్‌ కావడం కష్టం. అదే విషయం ఆయనకు చెప్పాను. అయితే ఈ కథను తను ఎలా చూపించబోతున్నాడో దర్శకుడు రామ్‌కమల్‌ వివరించిన విధానానికి థ్రిల్‌ అయ్యాను. హ్యూమన్‌ ఎమోషన్స్‌, కమర్షియల్‌ అంశాలు కథలో బాగా ఉన్నాయనిపించింది. చాలా సార్లు మేమిద్దరం ఈ కథ గురించి చర్చించిన తర్వాత మంచి స్ర్కిప్ట్‌ అవుతుందనే నమ్మకం కలిగింది. ఈ కథను సినిమాకు తగ్గట్లు మలచడం నిజంగా నాకు ఒక ఛాలెంజే అని చెప్పాలి’ అన్నారు విజయేంద్రప్రసాద్‌.

ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్‌ను తాజాగా విడుదల చేశారు. SS1ఎంటర్‌టైన్మెంట్, PK ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్‌లో ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న అశ్విన్ రంగరాజు గతంలో రాజమౌళితో కలిసి పనిచేశాడు. ఈగ, బాహుబలి సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశాడు.
 
రామ్ కమల్ ఈ సినిమా కోసం ఒక కమర్షియల్ సబ్జెక్టుతో వచ్చారని ఇందులో అన్ని రకాల హ్యూమన్ ఎమోషన్స్ నిండి ఉంటాయని అన్నారు విజయేంద్ర ప్రసాద్. ఇది రామ్ కమల్ డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఇలాంటి ప్రాజెక్ట్ కోసం తాను కూడా చేతులు కలపడం తనకు చాలా సంతోషంగా ఉన్నట్లు తెలిపారు విజయేంద్రప్రసాద్. ఈ సినిమా షూటింగ్ మరికొద్ది నెలల్లో సెట్స్ పైకి వెళ్లనుంది. చాలా వరకు ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్, లండన్ మరియు వెస్ట్ బెంగాల్ లలో జరగబోతున్న ట్లు తెలుస్తోంది.
  
1770లోనే స్వాతంత్ర కాంక్ష కలిగిన కొందరు భారతీయుల వీరగాధను ఈ సినిమా ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నామని రచయిత విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. దీపావళి సందర్భంగా ఈ సినిమా నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలు తెలియజేయనున్నట్లు నిర్మాతలు వెల్లడించారు.

click me!