ఇదే కాంబినేషన్ లో సినిమా మళ్లీ ఎప్పుడు వస్తుందనే ఆలోచన అభిమానుల్లో కలగటం సహజం. అందుతున్న సమాచారం ఈ కాంబినేషన్ కు ప్లానింగ్ జరుగుతోందిట. మరోసారి ఈ పవర్ ఫుల్ సెన్సేషన్ భాక్సాఫీస్ ని బంగారు బాతుని చేయాలనుకుంటున్నారట.
ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన ఛత్రపతి, బాహుబలి 1,2 ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. బాహుబలి తర్వాత ప్రభాస్ స్టేచరే మారిపోయింది. ప్యాన్ ఇండియా స్టార్ అయ్యిపోయారు. ఈ నేపధ్యంలో ఇదే కాంబినేషన్ లో సినిమా మళ్లీ ఎప్పుడు వస్తుందనే ఆలోచన అభిమానుల్లో కలగటం సహజం. అందుతున్న సమాచారం ఈ కాంబినేషన్ కు ప్లానింగ్ జరుగుతోందిట. మరోసారి ఈ పవర్ ఫుల్ సెన్సేషన్ భాక్సాఫీస్ ని బంగారు బాతుని చేయాలనుకుంటున్నారట. ఈ మేరకు ఆలోచనలు, చర్చలు గత కొద్దికాలంగా జరుగుతన్నాయిట.
ఆల్రెడీ ప్రభాస్ తో చేయటానికి రాజమౌళి ఓ స్టోరీ లైన్ ని రెడీ చేసారట. అయితే పూర్తి స్క్రిప్టు మీద మాత్రం కూర్చోలేదట. తను, ప్రభాస్ కాంబినేషన్ లో సినిమా అంటే అంచనాలు ఏ స్దాయిలో ఉంటాయో తెలుసు కాబట్టి ఆచి,తూచి అడుగులు వేస్తారట. అలాగే ప్రభాస్ సైతం వరస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. వాటిని ఫినిష్ చేసి కానీ రాజమౌళి దగ్గరకు రాలేడు. రాజమౌళి తన తదుపరి చిత్రం మహేష్ తో చేసాక..ప్రభాస్ తో ముందుకు వెళ్తారట. అంటే మరో రెండేళ్లు పట్టచ్చు. ప్రస్తుతం రాజమౌళి ..ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు.
ఇక ప్రభాస్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నాడు. జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రాధే శ్యామ్ చిత్ర షూటింగ్ కొంత పెండింగ్‌లో ఉండగా, ఈ మూవీ కరోనా వేవ్ తగ్గాక థియేటర్‌లో విడుదల కానుంది. ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్, ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆదిపురుష్ చిత్రాలు వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలోను ప్రభాస్ ఓ చిత్రం చేయనుండగా, ఈ చిత్రాన్ని హాలీవుడ్ రేంజ్‌లో తెరకెక్కించనున్నారు. 2022లో ఈ చిత్ర షూటింగ్ పూర్తి కానున్నట్టు తెలుస్తుండగా, 2023లో మూవీ విడుదల కానుంది. ఇక సిద్ధార్ద్ ఆనంద్ అనే బాలీవుడ్ డైరెక్టర్‌తోను ప్రభాస్ ఓ చిత్రం చేయనున్నాడు. ప్రశాంత్ నీల్- దిల్ రాజు కాంబినేషన్‌లో ఓ చిత్రం చేసేందుకు ప్రభాస్ సిద్ధంగా ఉన్నాడు. 2024లో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. అంటే 2024 చివరి వరకు ప్రభాస్ కాల్షీట్స్ ఫుల్ బిజీ. మరి ఇలాంటి పరిస్థితులలో ప్రభాస్, రాజమౌళి సినిమా ఎప్పుడూ అంటే చెప్పటం కష్టమే.