జాతీయ అవార్డులపై రాజమౌళి, ఎన్టీఆర్ ల స్పెషల్ ట్వీట్స్!

Published : Aug 10, 2019, 01:01 PM IST
జాతీయ అవార్డులపై రాజమౌళి, ఎన్టీఆర్ ల స్పెషల్ ట్వీట్స్!

సారాంశం

జాతీయ స్థాయిలో తెలుగు చిత్రపరిశ్రమ అవార్డుల పంట పండించడంపై సినీ దర్శకుడు రాజమౌళి, నటుడు ఎన్టీఆర్ హర్షం వ్యక్తం చేశారు.   

66వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో తెలుగు చిత్రసీమ సత్తా చాటడంతో సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈసారిమొత్తం ఏడు అవార్డులు దక్కించుకోవడంపై సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ట్విట్టర్ ద్వారా స్పందిస్తున్నారు.

దర్శకధీరుడు రాజమౌళి అవార్డులు పొందిన వారికి అభినందనలు తెలిపారు.  నేషనల్ అవార్డ్స్ లో తెలుగు చిత్రసీమ ఎక్కువ అవార్డులు పొందడం సంతోషాన్నిచ్చిందన్నారు. నటుడు ఎన్టీఆర్ కూడా ట్విట్టర్ వేదికగా అవార్డులు పొందిన వారికి శుభాకాంక్షలు చెబుతూ తెలుగు సినీరంగం విజయపథంలో దూసుకుపోతుందని వ్యాఖ్యానించారు.

'మహానటి', 'అ!', 'చిలసౌ' చిత్రబృందాలకు అభినందనలు తెలిపారు. 'మహానటి' సినిమాలో సావిత్రిగా నటించిన కీర్తి సురేశ్ జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా నిలిచారు. బెస్ట్ కాస్ట్యూమ్స్, ఉత్తమ ప్రాంతీయ చిత్రం విభాగాల్లో ఈ సినిమా మరో రెండు అవార్డులను దక్కించుకుంది. అలాగే 'రంగస్థలం', 'అ!', 'చిలసౌ' సాంకేతిక విభాగాల్లో అవార్డులు సాధించాయి.

 

PREV
click me!

Recommended Stories

చిరంజీవినే ఎదిరించిన అనిల్ రావిపూడి, మెగాస్టార్ మాటకు నో చెప్పిన దర్శకుడు, కారణం ఏంటి?
Bigg Boss 9 Winner: బిగ్‌ బాస్‌ విన్నర్‌ని కన్ఫమ్‌ చేసిన భరణి, సుమన్‌ శెట్టి.. నాగార్జునకి కొత్త తలనొప్పి