రాజమౌళి 'మండల దీక్ష' పట్టి మరీ పూర్తి!

By Surya Prakash  |  First Published Jun 23, 2021, 11:01 AM IST

ప్రస్తుతం రాజమౌళి ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా   ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కాల్పనిక స్వాతంత్య్ర పోరాట నేపథ్యంలో విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా కథను రెడీ  చేస్తే దాన్ని అద్బుతంగా జనరంజకంగా రూపొందిస్తున్నారు రాజమౌళి.  


మండల దీక్ష అంటే రాజమౌళి మాల వేసుకుంటున్నారు అనుకోవద్దు. ఆయన నలభై రోజులు పాటు కంటిన్యూగా గ్యాప్ లేకుండా వర్క్ చేయటానికి ప్లాన్ చేసారు. అన్ని రోజులూ ఓ దీక్షలా పనులు ముందుకు తీసుకెళ్ళనున్నారు. 

రాజమౌళి ప్రతీది ప్లానింగ్ ప్రకారం వెళ్తారు. అందుకే ఆయన అంతంత భారీ ప్రాజెక్టులను కూడా అవలీలగా పూర్తి చేయగలుగుతున్నారు. అయితే కరోనా వల్ల అందరి ప్లాన్స్ తల క్రిందులయ్యాయి. ఎవరూ ఏమీ చెయ్యలేని  పరిస్దితి నెలకొంది. దాంతో షూటింగ్ లు ఆపుచేసి లాక్ డౌన్ ఎప్పుడు ఎత్తేస్తారా అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఆ సమయం రానే వచ్చింది. తెలుగు సినిమా రాజధాని అయిన హైదరాబాద్ లో లాక్ డౌన్ తీసేసారు. ఇప్పుడు అందరి దృష్టీ  ‘ఆర్ఆర్ఆర్’ ఎప్పుడు ప్రారంభమవుతుందా అని ఉంది. మరి రాజమౌళి ఏం ప్లాన్ చేస్తున్నారో చూద్దాం.
  
ప్రస్తుతం రాజమౌళి ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా   ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కాల్పనిక స్వాతంత్య్ర పోరాట నేపథ్యంలో విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా కథను రెడీ  చేస్తే దాన్ని అద్బుతంగా జనరంజకంగా రూపొందిస్తున్నారు రాజమౌళి. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తే.. ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపించనున్నారు. బాలీవుడ్ అగ్ర హీరో అజయ్ దేవ్‌గణ్ కథను కీలక మలుపు తిప్పే పాత్రలో నటించబోతున్నారు.ఈ చిత్రానికి వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు.  ఈ చిత్రం షూటింగ్ త్వరలో హైదరాబాద్ లోని ఓ స్టూడియోలో ప్రారంభం కానుంది.
 
ఈ మేరకు రాజమౌళి స్వయంగా 40 రోజులు టార్గెట్ పెట్టుకున్నారు. అంటే మండల దీక్షలాగ ఆయన పూర్తిగా ఆర్ ఆర్ ఆర్ పై దృష్టి పెట్టి పూర్తి చేయబోతున్నట్లు సమాచారం. జూలై కి మాగ్జిమం షూట్ ఫినిష్ చేయాలని భావిస్తున్నారు. అందుకు కారణం ..ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివతో మొదలెట్టడానికి రెడీ అయ్యిపోతున్నారు. ఆ సినిమా కోసం ఆర్ ఆర్ ఆర్ తర్వాత ప్రత్యేకమైన మేకోవర్ వెళ్లనున్నారు.

Latest Videos

దాంతో ఎన్టీఆర్ తో రాజమౌళి ఎట్టి  పరిస్దితుల్లోనూ ఆగస్ట్ ఫస్ట్ట్ వీక్ కు పూర్తి చేసి పంపించేస్తాను అని చెప్పారట. అలియాభట్ సైతం జూలై ఫస్ట్ వీక్ నుంచి షూటింగ్ లో పాల్గొననుంది. అన్ని అనుకున్నట్లు జరిగితే అక్టోబర్ 13,2021న రిలీజ్ చేస్తారు. మళ్లీ ధర్డ్ వేవ్ అంటే మాత్రం వచ్చే సంవత్సరం రిలీజ్  ఉంటుంది. రామ్ చరణ్ మాత్రం ఓ ప్రక్క ఆచార్యలో చేస్తూనే ఆర్ ఆర్ ఆర్ ఫినిష్ చేయనున్నారు.
   

సినిమా విశేషాలకు వస్తే.. ఎన్టీఆర్ ఈ సినిమా గురించి ఓ విషయాన్ని పంచుకున్నాడు. ఈ సినిమా ఓ రేంజ్ లో ఉంటుందని తారక్ తెలిపాడు. అంతేకాకుండా ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు చూస్తే.. ప్రేక్షకులు సీట్లో కూర్చోలేరంటూ ఆసక్తికరమైన కామెంట్ చేశారు. ఇక భారీ సెట్టింగ్ తో సినిమా మరోలా ఉంటుందని తెలిపాడు తారక్. 

 ఈ చిత్రంలో హాలీవుడ్.. బాలీవుడ్ స్టార్స్ అజ‌య్ దేవ‌గ‌ణ్‌, ఆలియా భ‌ట్‌, ఒలివియా మోరిస్‌, అలిస‌న్ డూడి, రే స్టీవెన్ స‌న్ న‌టిస్తున్నారు. కోలీవుడ్ విల‌క్ష‌ణ న‌టుడు స‌ముద్ర‌ఖ‌ని కూడా ఓ కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నారు. డి.వి.వి.దాన‌య్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  
 

click me!