
దర్శకధీరుడు రాజమౌళికి కోపం వచ్చింది. `ఆర్‌ఆర్‌ఆర్` ఈవెంట్‌లో ఆయన ఫైర్ అయ్యారు. స్టేజ్‌పై కొచ్చిన ఆయన అందరు స్టేజ్ దిగిపోండి అంటూ మండిపడ్డారు. స్టేజ్ మొత్తం తన కంట్రోల్‌లోకి తీసుకుని కాసేపు అందరిని షాక్‌కి గురి చేశారు. ఇండియన్ ప్రస్టీజియస్ మూవీ `ఆర్‌ఆర్‌ఆర్` మరో వారంలో థియేటర్లోకి రాబోతుంది. ఈ నేపథ్యంలో కర్నాటకలోని చిక్కబల్లాపూర్‌లో `ఆర్‌ఆర్‌ఆర్` బిగ్గెస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహిస్తున్నారు.
ఈ ఈవెంట్‌కి కర్నాటక సీఎం బసవరాజు బొమ్మై గెస్ట్ గా విచ్చేశారు. ఆయనతోపాటు కన్నడ స్టార్ హీరో, పునీత్ రాజ్‌కుమార్ అన్నయ్య శివరాజ్ కుమార్ సైతం గెస్ట్ గా పాల్గొన్నారు. కల్చరల్ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత వేదికపై ఎన్టీఆర్, రామ్‌చరణ్, రాజమౌళి, శివరాజ్‌కుమార్‌ని యాంకర్ సుమ పిలిచారు. స్టేజ్‌పైకి వచ్చాక బాడీగార్డ్ లు, డాన్సర్లు భారీగా స్టేజ్‌పైకి చేరారు. అంతేకాదు ఎన్టీఆర్, చరణ్‌లను ఇబ్బంది పెట్టారు. షేక్ హ్యాండ్ కోసం ఎగబడటంతో అంతా గందరగోళం నెలకొంది.
స్టేజ్ మొత్తం బాడీగార్డ్ లు, డాన్సర్లతో నిండిపోవడంతో ఇబ్బందిగా మారింది. దీంతో మండిపోయిన దర్శకుడు రాజమౌళి ఫైర్ అయ్యారు. మైక్ తీసుకుని బాడీగార్డ్స్ అందరిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అటూ ఇటు స్టేజ్ మొత్తం హడావుడి చేశారు. బాడీగార్డ్స్, డాన్సర్లు అంతా దిగిపోవాలని ఫైర్ అయ్యారు. పోలీసులు వారిని పంపించేయాలని, పోలీసులు తప్ప ఇంకా ఎవరూ ఉండకూడదని స్పష్టం చేశారు. సీఎం వచ్చి ఉన్నారని, ప్రోటోకాల్ ఉందని, దాన్ని పాటించాలని ఆయన తెలిపారు. గట్టిగా అరిచారు. దీంతో అంతా షాక్‌కి గురయ్యారు. పోలీసులు కాసేపట్లోనే స్టేజ్‌ని ఖాళీ చేయించారు.
ఎన్టీఆర్, చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన చిత్రం `ఆర్‌ఆర్‌ఆర్`. డివివి దానయ్య నిర్మించారు. అలియాభట్, ఒలివియా మోర్రీస్ హీరోయిన్లుగా, అజయ్ దేవగన్, శ్రియా కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతుంది.