
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఫస్ట్ టైమ్ హోస్ట్ గా చేస్తున్న షో `లాకప్`. ఇది ప్రారంభం నుంచే సంచలనంగా మారింది. వివాదాలకు కేరాఫ్‌గా నిలుస్తుంది. మరోవైపు ఇందులో పాల్గొన్న కంటెస్టెంట్లు వెల్లడిస్తున్న విషయాలు సంచలనంగా మారడంతోపాటు షాక్‌కి గురి చేస్తున్నాయి. అయితే ఇందులో ఎలిమినేషన్ నుంచి తప్పించుకునేందుకు కంటెస్టెంట్లు తమ జీవితంలోనే అనేక సీక్రెట్లు వెల్లడిస్తున్నారు. షాక్‌కి గురి చేస్తున్నారు.
అందులో భాగంగా తాజాగా మోడల్, నటి సారా ఖాన్ తన మాజీ భర్త, లాకప్ కంటెస్టెంట్ అలీ మర్చంట్ గురించి ఓ షాకింగ్ సీక్రెట్‌ని బయటపెట్టింది. తామిద్దరు ఎలా విడిపోయారో వెల్లడించింది. అలీ మర్చంట్‌కి ముంబయిలోని లోఖండ్‌వాలాలో ఒక స్పా ఉందని, అక్కడ పనిచేసే అమ్మాయితో అలీ అక్రమ సంబంధం పెట్టుకున్నాడని వెల్లడించింది. ఈ విషయం తెలిసి ఆయనకు చాలా సార్లు వార్నింగ్ ఇచ్చానని, మారే అవకాశాన్ని ఇచ్చానని తెలిపింది సారా ఖాన్.
ఆయనకు ఎంత చెప్పినా మారకపోవడంతో విడాకులు తీసుకోక తప్పలేదని స్పష్టం చేసింది. తాను మనసారా ప్రేమించిన మొట్టమొదటి వ్యక్తి అతడేనని, అందుకే అతడు అడ్డంగా దొరికిపోయినా పోనీలే అనుకుని మరో అవకాశం ఇచ్చానని చెప్పింది. ఇలా సుమారు మూడున్నరేళ్ల కాలంలో 300 ఛాన్సులు ఇచ్చానని, కానీ అతడు దాన్ని నిలబెట్టుకోలేకపోయాడని పేర్కొంది. విడాకుల తర్వాత తిరిగి మామూలు మనిషిని కావడానికి తనకు దాదాపు నాలుగున్నర సంవత్సరాలు పట్టిందని చెప్పుకొచ్చింది.
చాలా రోజులపాటు డేటింగ్ చేసిన సారాఖాన్, అలీ మర్చంట్ 2010లో బిగ్‌బాస్ షోలో పెళ్లి చేసుకున్నారు. ఇది పెద్ద సంచలనంగా మారింది. అయితే బిగ్‌బాస్ షోలో మ్యారేజ్ చేసుకోవడానికి వారికి రూ.50 లక్షలు ముట్టజెప్పారంటూ కొన్ని వదంతులు కూడా పుట్టుకొచ్చాయి. ఏదేమైనా సెన్సేషనల్‌గా మారిన వారి పెళ్లి ఎంతోకాలం నిలవలేదు. వివాహం చేసుకున్న రెండు నెలలకే విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం విడిగా ఉంటున్నారు. తాజాగా `లాకప్` షోలో సారా ఖాన్ సందడి చేస్తూ అలరిస్తుంది.