గ్లోబల్ వేదికపై రాజమౌళి నోటి నుంచి ఆ మాట.. మహేష్ మూవీపై ఆసక్తి పెంచేశాడుగా..

Published : Sep 13, 2022, 06:47 AM IST
గ్లోబల్ వేదికపై రాజమౌళి నోటి నుంచి ఆ మాట.. మహేష్ మూవీపై ఆసక్తి పెంచేశాడుగా..

సారాంశం

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటోంది. బాహుబలి తర్వాత ఆర్ఆర్ఆర్ తో జక్కన్న మరో మ్యాజిక్ చేశాడు.

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటోంది. బాహుబలి తర్వాత ఆర్ఆర్ఆర్ తో జక్కన్న మరో మ్యాజిక్ చేశాడు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులంతా ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని తెగ ఎంజాయ్ చేస్తున్నారు. గ్లోబల్ వేదికపై రాజమౌళి ఖ్యాతి మరో స్థాయికి చేరింది అనే చెప్పాలి. 

ప్రస్తుతం రాజమౌళి యూఎస్ టూర్ లో ఉన్నారు. అక్కడ జరుగుతున్న ఓ ఫిలిం ఫెస్టివల్ కి రాజమౌళి అతిథిగా హాజరయ్యారు. అక్కడ మీడియాతో మాట్లాడుతూ రాజమౌళి తన నెక్స్ట్ మూవీ గురించి ఆసక్తిర విషయం రివీల్ చేశాడు. అది పాత విషయమే అయినప్పటికీ జక్కన్న నోటి నుంచి రావడంతో ఆసక్తి పెరిగిపోయింది. 

రాజమౌళి తదుపరి చిత్రం సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఉండబోతోంది. మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. తన తదుపరి చిత్రం గ్లోబల్ మొత్తం ట్రావెల్ అయ్యే ఒక అడ్వెంచర్ మూవీ అని కంఫర్మ్ చేశారు. ఈ విషయాన్ని ఇదివరకే విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. కాకపోతే ఏదీ ఫైనల్ కాలేదు అని మరి కొన్ని లైన్స్ కూడా అనుకుంటున్నట్లు విజయేంద్ర ప్రసాద్ గతంలో తెలిపారు. 

ఇప్పుడు జక్కన్న ఖరారు చేయడంతో మహేష్ మూవీ థీమ్ సెట్ అయినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ప్రధానంగా ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగుతుంది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లొకేషన్స్ లో కూడా ఈ చిత్రాన్ని చిత్రీకరించనున్నారు. రాజమౌళి ఇంతవరకు ఇలాంటి మూవీ చేయలేదు అనే చెప్పాలి. 

రాజమౌళి ఎక్కువగా ఫారెన్ లొకేషన్స్ ని కూడా ఎంచుకోరు. కానీ తొలిసారి జక్కన్న తెరకెక్కించబోయే చిత్రం ఎక్కువగా విదేశాల్లో షూటింగ్ జరుపుకోనున్నట్లు తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode: జ్యో, పారులకు దీప వార్నింగ్- వణికిపోయిన పారు- జ్యో ట్రాప్ లో కాశీ
Bigg Boss 9 Winner Prize Money : టైటిల్ విన్నర్ కు షాకింగ్ రెమ్యునరేషన్ తో పాటు, భారీగా బెనిఫిట్స్ కూడా, ఏమిస్తారంటే?