నాని 'బాబు'.. లవ్యూ : రాజమౌళి

Published : Apr 22, 2019, 12:53 PM IST
నాని 'బాబు'..  లవ్యూ : రాజమౌళి

సారాంశం

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి మంచి సినిమాలను ప్రోత్సహించడంలో ముందుంటారు. 

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి మంచి సినిమాలను ప్రోత్సహించడంలో ముందుంటారు. తనకు ఏదైనా సినిమా నచ్చితే దానిగురించి సోషల్ మీడియాలో గొప్పగా రాస్తుంటారు. అయితే ఈ మధ్యకాలంలో రాజమౌళి సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండడం లేదు.

తాజాగా నాని నటించిన 'జెర్సీ' సినిమా చూసిన ఆయన ట్విట్టర్ లో ప్రశంసలు కురిపించారు. ఎంతో బాగా రాసి, అంతే అందంగా సన్నివేశాలను మలిచి తెరక్కించారు.. వెల్ డన్ గౌతం తిన్ననూరి అంటూ దర్శకుడిపై పొగడ్తలు కురిపించారు.

సినిమాకు పని చేసిన ప్రతిఒక్కరూ గర్వంగా ఫీల్ అయ్యేలా చేసే సినిమా 'జెర్సీ అని.. నాని బాబు జస్ట్ లవ్యూ అంతే అంటూ పోస్ట్ లో రాసుకొచ్చారు. రాజమౌళి.. నానిని ప్రత్యేకంగా బాబు అని ఎందుకు పిలిచాడో.. సినిమా చూసిన వారి అర్ధమయ్యే ఉంటుంది.

ఈ సినిమాలో హీరోయిన్ శ్రద్ధాకపూర్.. నానిని బాబు అంటూ పిలుస్తుంది. అందుకే రాజమౌళి కూడా బాబు అని పిలిచి లవ్యూ చెప్పాడు. 

PREV
click me!

Recommended Stories

ప్రభాస్, రామ్ చరణ్ తో పాటు.. 2026లో బాక్సాఫీస్ ను షేక్ చేయబోతున్న స్టార్ హీరోల సినిమాలు
Bigg Boss Telugu 9: నిధి అగర్వాల్ కి చుక్కలు చూపించిన ఇమ్మాన్యుయేల్.. హౌస్ లో కూడా ఆమె పరిస్థితి అంతేనా ?