Rajamouli:జనాన్ని థియేటర్ కు రప్పించటానికి రాజమౌళి చెప్పిన టెక్నిక్

By Surya PrakashFirst Published Jun 30, 2022, 9:52 AM IST
Highlights

చాలా సినిమాలు భాక్సాఫీస్ దగ్గర వర్కవుట్ కాకపోవటంపై ఆయన తనదైన శైలిలో విశ్లేషించారు. ఆయన చెప్పిన మాటలు వందకు వంద శాతం నిజం అంటున్నారు సినిమావాళ్లు. ఫ్లాఫ్ అవుతున్న సినిమాలని చూపెట్టి థియోటర్ కు జనం రారు అనటం మన హిప్పోక్రసీ తప్ప మరొకటి కాదంటున్నారు. 


లావణ్యా త్రిపాఠి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘హ్యాపీ బర్త్‌ డే. ‘మత్తు వదలరా’ ఫేమ్‌ రితేష్‌ రానా దర్శకత్వం వహించారు. నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెర్రి), హేమలత పెదమల్లు నిర్మించిన ఈ సినిమా జూలై 8న విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ని రాజమౌళి విడుదల చేసి, చెప్పిన మాటలు ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారాయి. ఈ విషయమై సోషల్ మీడియాలో  ఓ రేంజిలో చర్చ జరుగుతోంది. ఇంతకీ అసలు ఆయన ఏమన్నారో చూద్దాం.

రాజమౌళి మాట్లాడుతూ.... ”ఈ మధ్య ప్రేక్షకులు థియేటర్స్‌కు రావడంలేదు అంటున్నారు. కానీ నా అభిప్రాయం ప్రకారం యూనిట్‌ మనసు పెట్టి కష్టపడి చేసిన ఏ సినిమాని కూడా ప్రేక్షకులు వదులుకోరు. ఏ సినిమా చేసిన సంపూర్ణంగా చేస్తే ప్రేక్షకులు థియేటర్ కి వస్తారని నా విశ్లేషణ. కామెడీ చేస్తే జనాలు విరగబడి నవ్వేలా వుండాలి, ఫైట్స్ వున్న సినిమా తీస్తే గ్రేటెస్ట్ యాక్షన్ చూపించాలి. కానీ హాఫ్ హార్టడ్ గా సినిమాలు తీస్తుంటే జనాలు రావడం లేదు, సంపూర్ణంగా తీస్తే జనాలు వస్తారని భావిస్తున్నా. .. అలా కష్టపడాలని సూచిస్తున్నాను ” అన్నారు రాజమౌళి. 

చాలా సినిమాలు భాక్సాఫీస్ దగ్గర వర్కవుట్ కాకపోవటంపై ఆయన తనదైన శైలిలో విశ్లేషించారు. ఆయన చెప్పిన మాటలు వందకు వంద శాతం నిజం అంటున్నారు సినిమావాళ్లు. ఫ్లాఫ్ అవుతున్న సినిమాలని చూపెట్టి థియోటర్ కు జనం రారు అనటం మన హిప్పోక్రసీ తప్ప మరొకటి కాదంటున్నారు. రాజమౌళి సినిమాల సక్సెస్ ని కూడా ఆయన పూర్తి స్దాయిలో చెప్పేసారంటున్నారు.  ఈ మధ్యకాలంలో వచ్చి హిట్టైన ఆర్ ఆర్ ఆర్, కేజీఎఫ్ 2, విక్రమ్ సినిమాలు పూర్తి యాక్షన్ తో వచ్చాయి కాబట్టే సూపర్ హిట్టయ్యాయని అంటున్నారు. కాబట్టి రాజమౌళి చెప్పినట్లు సంపూర్తిగా మనస్సు పెట్టి తీస్తే ఖచ్చితంగా థియోటర్స్ కళకళ్లాడతాయి.

ఇక   జూనియర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ మల్టీస్టారర్‌గా తెరకెక్కిన చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌. ఎస్‌ఎస్‌ రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ మూవీ మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చరిత్రలోని ఇద్దరు సమరయోధులు కలిస్తే ఎలా ఉంటుందనే సరికొత్త థిమ్‌తో జక్కన ఈ సినిమాను రూపొందించాడు. జూనియర్‌ ఎన్టీఆర్‌ కొమురం భీమ్‌గా, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ అల్లూరి సీతారామారాజుగా కనిపించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సుమారుగా రూ. 1200 కోట్లు వసూళ్లు చేసింది.

click me!