తప్పును ఒప్పుకున్న జక్కన్న!

Published : Dec 24, 2018, 05:13 PM IST
తప్పును ఒప్పుకున్న జక్కన్న!

సారాంశం

మంచి క్రేజ్ ఉన్న సినీ ప్రముఖులు ఒక  మాటంటే అది జనాల్ని ఎంతో కొంత ప్రభావితం చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే చేసే పనిలో చెప్పే మాటలో నిజం లేకుంటే జనాల్లో వాల్యూ లేకుండా పోతుంది. 

మంచి క్రేజ్ ఉన్న సినీ ప్రముఖులు ఒక  మాటంటే అది జనాల్ని ఎంతో కొంత ప్రభావితం చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే చేసే పనిలో చెప్పే మాటలో నిజం లేకుంటే జనాల్లో వాల్యూ లేకుండా పోతుంది. ఏం చెప్పినా కూడా మరోసారి పట్టించుకోరు. అందుకే చాలా మంది ఎందుకొచ్చిన గొడవ అని ఏం మాట్లాడకుండా సైలెంట్ గా వెళ్ళిపోతారు. 

అయితే సినిమా ఇండస్ట్రీలో కొన్ని సార్లు ఇతరుల కోసం కొన్ని చేయక తప్పదు. అసలు మ్యాటర్ లోకి వస్తే దర్శకదీరుడు రాజమౌళి గత కొంత కాలంగా సినిమాల గురించి ట్వీట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆ విషయం గురించి రీసెంట్ గా జరిగిన కాఫీ విత్ కరణ్ షోలో ఒక క్లారిటీ ఇచ్చాడు. ఎపుడైనా నచ్చని సినిమాలకు పాజిటివ్ గా ట్వీట్ చేశారా అని కరణ్ నుంచి ఎదురైన ప్రశ్నకు.. అవును చేశాను అంటూ నిజాన్ని బయటపెట్టేశాడు. 

ఎందుకంటే గతంలో పటేల్ సార్ - యుద్ధం శరణం అలాగే పైసా వసూల్ లాంటి డిజాస్టర్ సినిమాలపై రాజమౌళి పాజిటివ్ గా కామెంట్ చేశాడు. ఆ సినిమాలు ఏ మాత్రం సంతృప్తిపరచకపోవడంతో ఆయన మాటపై జనాలకు ఒక విధమైన నెగిటివ్ ఆలోచన ఏర్పడింది. మళ్ళీ దాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 

ఈగ నిర్మాత సాయి కొర్రపాటి కోసం ట్వీట్ లు వేయక తప్పలేదు. కానీ జక్కన్న ట్విట్టర్ రివ్యూను మాత్రం జనాలు నమ్మడం లేదు.  కాఫీ విత్ కరణ్ లో తప్పు అయితే ఒప్పుకున్నారు కానీ ఏ సినిమాలపై ఇష్టలేకపోయిన ట్వీట్ చేశారు అనే విషయాన్ని మాత్రం బయటపెట్టలేదు. 

PREV
click me!

Recommended Stories

Krishnam Raju: చిరంజీవి ఇలా మనసు పడ్డాడో లేదో, మెడలో ఖరీదైన గిఫ్ట్ పెట్టిన కృష్ణంరాజు.. మర్చిపోలేని బర్త్ డే
మడత మంచం పై పడుకొని, ప్రకృతిని ఆస్వాదిస్తున్న అనసూయ