Will Smith In Mumbai : ముంబైలో అడుగుపెట్టిన హాలీవుడ్ స్టార్ హీరో విల్ స్మిత్.. ఎవర్ని కలిశారంటే?

Published : Apr 23, 2022, 01:46 PM IST
Will Smith In Mumbai : ముంబైలో అడుగుపెట్టిన హాలీవుడ్ స్టార్ హీరో విల్ స్మిత్.. ఎవర్ని కలిశారంటే?

సారాంశం

ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం 2022 వేదికపై హాలీవుడ్ స్టార్ హీరో విల్ స్మిత్ యాంకర్ ను చెంపదెబ్బ కొట్టిన సంగతి అందరికీ తెలిసిందే. తన టైం బాగాలేకపోవడంతో ఓ ప్రముఖ వ్యక్తిని కలిసేందుకు ముంబయిలో  అడుగుపెట్టినట్టు తెలుస్తోంది.   

ఆస్కార్‌ వేదికగా చెంపదెబ్బ కొట్టిన హాలీవుడ్‌ స్టార్‌ హీరో విల్ స్మిత్ (Will Smith) ఎంతటి వివాదంలో చిక్కుకున్నాడో అందరకీ తెలిసిందే. ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం 2022 వేదికగా యాంకర్ క్రిస్ ను చెంప దెబ్బకొట్టడం అందరిని షాక్ కు గురి చేసింది. యాంకర్ క్రిస్ స్మిత్ భార్యపై అభ్యంతరకరంగా కామెంట్లు చేయడంతో రగిలిపోయిన ఆయన ఆవేశంలో క్రిస్ పై చేయిచేసుకున్నాడు. ఈ ఘటన తర్వాత స్మిత్ తన ప్రవర్తను బాధ్యత వహిస్తూ వేదికకు హాజరైన అతిథులకు క్షపణాలు చెప్పారు. మరోవైపు  ఆస్కార్ కమిటీ కూడా పదేండ్ల పాటు స్మిత్ ను ఆస్కార్ అవార్డు అర్హతకు నిషేదం విధించింది. అంతేకాకుండా ఆయన సినిమాలకు కూడా వరుసగా బ్రేక్ లు పడ్డాయి. 

ఇలా ఒక్క క్షణం ఆవేశపూరితంగా ప్రవర్తించిన విల్ స్మిత్  జీవితం తలకిందులయ్యిందనే చెప్పాలి. ఈ క్రమంలో తన టైం బాగాలేకపోవడంతో ఇండియాలోని ప్రముఖ ఆధ్యాత్మిక గురువును కలిసేందుకు ఈ రోజులు ముంబైకి చేరుకున్నాడు. ముంబైలోని కలీనా విమానాశ్రయంలో విల్ స్మిత్ కనిపించడంతో అందరూ ఆశ్చర్యపోయారు తన ఇండియా ప్రకటనపై కూడా ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. 

అయితే ముంబైకి చేరుకున్న విల్ స్మిత్ నేరుగా ఆధ్యాత్మిక గురువు సద్గురువును కలవడానికి ఆయన నివాసానికి వెళ్లారు. అయితే తన భార్య జాండా స్మిత్ పై యాంకర్ క్రిస్ కామెంట్లు చేయడం పట్ల చెంపదెబ్బ కొట్టిన ఘటన తర్వాత స్మిత్ సద్గురు (Sadhguru)ను కలవడం పట్ల సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది. అయితే సద్గురును స్మిత్ ఏ ఎందుకు కలిశారనేది రహస్యంగానే ఉంది. గతేడాది కూడా తన భార్యతో కలిసి విల్ స్మిత్ సద్గురు న కలిశారు. 

ఈ సంవత్సరం మాత్రం ఆస్కార్స్‌లో అపఖ్యాతి పాలైన చెంపదెబ్బ ఘటన తర్వాత స్మిత్ కనిపించడం ఇదే తొలిసారి. ముంబైకి చేరుకున్న స్మిత్ నగరంలోని జుహులోని JW మారియట్ హోటల్‌లో బస చేసినట్లు తెలుస్తోంది. సన్నిహితుల సమాచారం ప్రకారం సద్గురుతో ఆధ్యాత్మిక సమావేశనంతరం పలు ఆలయాలను, స్టార్చూ ఆఫ్ యూనిటీని కూడా సందర్శించనున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా విల్  స్మిత్ సద్దుగురును కలిసేందుకు ముంబైకి రావడం ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.

 

PREV
click me!

Recommended Stories

Rithu Remuneration బిగ్ బాస్ విన్నర్ రేంజ్ లో పారితోషికం, రీతూ చౌదరి ఎలిమినేషన్ కు కారణాలు ఇవే ?
30 ఏళ్ళు మేకప్ మ్యాన్ గా పని చేసిన వ్యక్తితో అనుష్క సినిమా, గోవాకి పిలిచి మరీ వార్నింగ్ ఇచ్చిన అగ్ర హీరో