బాలయ్య సినిమా టికెట్ల కోసం హత్య చేసినా ఫర్వాలేదు

Published : Aug 29, 2023, 08:10 AM IST
 బాలయ్య సినిమా టికెట్ల కోసం హత్య చేసినా ఫర్వాలేదు

సారాంశం

‘యజ్ఞం’, ‘పిల్లా నువ్వు లేని జీవితం’ హిట్ చిత్రాల దర్శకుడు ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రాజ్ తరుణ్ సినిమా చేస్తున్నారు. 

 

 యంగ్ హీరో రాజ్ తరుణ్ చాలా కాలంగా  సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. కెరీర్ ప్రారంభంలో చేసిన ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మామ, కుమారి 21ఎఫ్ చిత్రాలు మినహా ఒక్క హిట్ కూడా తగల్లేదు. లవ్ ,కామెడీ, రొమాన్స్ థ్రిల్లర్ ఇలా ప్రతి జోనర్ లోనూ ట్రై చేస్తున్న ఫలితం కనపడటం లేదు. ఈ నేపధ్యంలో రాజ్ తరుణ్ యాక్షన్ వైపుకు టర్న్ అయ్యారు. రాజ్‌ తరుణ్‌ హీరోగా బాలయ్యతో వీరభద్ర, సాయి తేజ్ తో పిల్లా నువ్వు లేని జీవితం చిత్రాలు తీసిన దర్శకుడు ఎ.ఎస్‌. రవికుమార్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘తిరగబడరసామీ’. ఈ చిత్రం  టీజర్  పూర్తి యాక్షన్ తో  ఉండబోతోందని అర్దమవుతోంది. మీరూ చూడండి.

చిన్న పిల్లలు తప్పిపోతే వాళ్ళను తల్లితండ్రుల దగ్గరికి చేర్చి సంతోషపడే సాప్ట్ క్యారక్టర్ లో  రాజ్ తరుణ్ కనిపించాడు. భయం చాలా ఎక్కువ. ప్రాణం అంటే చెప్పలేనంత ఇష్టం. అలాంటి అబ్బాయి ఫైట్లంటే ఇష్టపడే అమ్మాయి (మల్వి మల్హోత్రా) గర్ల్‌ఫ్రెండ్‌గా దొరుకుతుంది. ‘‘బాలయ్య సినిమా టికెట్ల కోసం హత్య చేసినా ఫర్వాలేదు’’ అనే డైలాగుతోనే ఆమె క్యారెక్టర్‌లో పవర్  గంజాయి వనం లాంటి ముఠాని నడిపిస్తున్న లోకల్ డాన్ మకరంద్ దేశ్ పాండే హీరోకి ఓ ప్రమాదరకమైన పని అప్పగిస్తాడు. అసలు వీళ్లిద్దరి ఉన్న సంబంధం ఏంటి? గొడవ అంటేనే భయపడే యువకుడు కత్తులు పట్టుకుని ఎందుకు కుత్తుకలు కొస్తాడు అనేది సినిమా కథ టీజర్ తో అర్దమవుతోంది.

‘యజ్ఞం’, ‘పిల్లా నువ్వు లేని జీవితం’ హిట్ చిత్రాల దర్శకుడు ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రాజ్ తరుణ్ సినిమా చేస్తున్నారు. సురక్ష ఎంటర్‌టైన్మెంట్ మీడియా పతాకంపై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘తిరగబడరా స్వామి’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమా మంచి ఎక్సపెషన్స్ ఏర్పడ్డాయనే చెప్పాలి.

రాజ్‌ తరుణ్‌ మాట్లాడుతూ.. ‘‘దర్శకుడు రవికుమార్‌ ఈ చిత్రంలో నాలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించారు. నేనెప్పుడూ ఏ చిత్రంలో పూర్తిస్థాయిలో యాక్షన్‌ చేయలేదు. దాంతో, వర్కౌట్‌ అవుతుందో, లేదోనని ఈ సినిమా క్లైమాక్స్‌ చిత్రీకరణ సమయంలో నాకు సందేహం కలిగింది. ఏం ఫర్వాలేదంటూ దర్శకుడు ముందుకు నడిపించారు. అవుట్‌పుట్‌ అద్భుతంగా వచ్చింది. విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తాం’’ అని అన్నారు. ఈ చిత్రంలో రాజ్‌తరుణ్‌ సరసన మాల్వీ మల్హోత్రా నటించింది. మన్నారా చోప్రా కీలక పాత్ర పోషించింది. టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. మీరూ ఓ లుక్కేయండి..
 
ఈ చిత్రంలో రఘుబాబు, జాన్ విజయ్, అంకిత ఠాకూర్, పృధ్వి, ప్రగతి, రాజా రవీంద్ర, బిత్రి సత్తి నటించారు.  విడుదల తేదీ ఇంకా ఖరారు చేయనప్పటికీ సెప్టెంబర్ లోనే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.  జవహర్ రెడ్డి ఎంఎన్ సినిమాటోగ్రఫీని నిర్వహించగా, జెబి సంగీతం అందించారు. భాష్యశ్రీ డైలాగ్స్ అందించిన ఈ చిత్రానికి బస్వ పైడి రెడ్డి ఎడిటర్ వ్యవహరిస్తున్నారు.

 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా