
హీరో రాజ్ తరుణ్, లావణ్యల ఇష్యూ టీవి సీరియల్ లో ఎండ్ ట్విస్ట్ ,సస్పెన్స్ లాగ రోజుకో మలుపు తిరుగుతూ ముందుకు వెళ్తోంది. ప్రస్తుతం రాజ్ తనని మోసం చేసి, హీరోయిన్ మాల్వీ మల్హోత్రాతో ప్రేమాయణం సాగిస్తున్నారని లావణ్య ఆరోపిస్తోంది. ఈ క్రమంలో ఈ కేసులో లెటెస్ట్ గా మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. రాజ్ తరుణ్ - మాల్వీల పేరుతో వాట్సాప్ చాట్ లీక్ అయ్యింది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో ఏముంది
ఆ వాట్సప్ ఛాట్ లో హీరో రాజ్ తరుణ్, మల్హోత్రా డేటింగ్, మీటింగ్‌కు సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి. వారిద్దరూ ఏ హోటల్ రూమ్స్‌లో కలుసుకున్నారు.. వంటి కీలకమైన సమాచారం ఉంది. దాని ప్రకారం 2023లో రాజ్ తరుణ్.. మాల్వీ మల్హోత్రాకు ప్రపోజ్ చేశాడు. దానికి మాల్వి యాక్సెప్ట్ చేసినట్టు మెసేజ్ పెట్టింది.. అనేకసార్లు రాజ్ తరుణ్‌కు మాల్వీ హోటల్స్ కూడా బుక్ చేసింది. రాజ్ తరుణ్ కోసం మాల్వీ మల్హోత్రా కోయంబత్తూరులోని మాధవ హోటల్ లో చాలాసార్లు రూమ్స్ బుక్ చేసినట్టుంది. వీళ్లిద్దరూ అక్కడే తరచుగా కలుసుకున్నట్టు తెలుస్తోంది.
ఇన్నాళ్లు మాల్వీతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ రాజ్ తరుణ్ చెబుతూ రావడంతో ఇప్పుడిలా వారి మధ్య జరిగిన చాట్స్ లీక్ కావడం సంచలనంగా మారింది.తాజా ఛాట్స్ ఎవరు లీక్ చేశారు.. అందులో నిజమెంత అనే అంశాల్ని పోలీసులు నిగ్గుతేల్చాల్సి ఉంది.
ఇక మాల్వి, రాజ్ తరుణ్‌పై లావణ్య కొద్దిరోజుల క్రితం నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముగ్గురిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లావణ్య పెట్టిన కేసులో రాజ్ తరుణ్‌కి పోలీసులు నోటీసులు కూడా పంపారు. గురువారం విచారణకు హాజరు కావాల్సి ఉండగా.. రాజ్ తరుణ్ రాలేదు. షూటింగ్స్, బిజీ షెడ్యూల్ కారణంగా విచారణకు హాజరు కాలేకపోతున్నానని రాజ్ తరుణ్ పోలీసులకు లేఖ రాసి తన లాయర్‌తో పంపించారు. విచారణకు హాజరయ్యేందుకు మరికొన్ని రోజుల గడువు కావాలని పోలీసులను కోరారు.