హీరో రాజ్ తరుణ్ లో మేటర్ లేదంట. అసలు విషయం తెలిశాక అందరి మైండ్ బ్లాక్ అయ్యింది. ఈ వీడియో చూస్తే మీకే అర్థం అవుతుంది.
రాజ్ తరుణ్-లావణ్యల వ్యవహారం టాలీవుడ్ హాట్ టాపిక్ గా ఉంది. లావణ్య అనే యువతితో రాజ్ తరుణ్ 10 ఏళ్లకు పైగా సహజీవనం చేశాడట. రాజ్ తరుణ్ తనను రహస్యంగా వివాహం చేసుకున్నాడు. రెండు సార్లు అబార్షన్ చేయించాడు. హీరోయిన్ మాల్వి మల్హోత్రాతో ఎఫైర్ పెట్టుకున్న రాజ్ తరుణ్ నన్ను వదిలించుకోవాలని చూస్తున్నాడు... అనేవి లావణ్య ప్రధాన ఆరోపణలు. నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా పై లావణ్య కేసు పెట్టింది. ఈ వివాదం ప్రస్తుతం కోర్టులో నడుస్తుంది.
ఈ పరిణామాల మధ్య రాజ్ తరుణ్ నపుంసకుడు అంటూ మరో వాదన తెరపైకి వచ్చింది. ఓ మహిళ ఈ మేరకు వీడియో విడుదల చేసింది. రాజ్ తరుణ్ నా ఫ్రెండ్ తో రిలేషన్ లో ఉన్నాడు. కానీ ఇద్దరి మధ్య ఒక ముద్దు ముచ్చట లేదు. ఆ విషయంలో ఆమెను దూరం పెడతాడట.. అని సదరు వీడియోలో యువతి చెప్పుకొచ్చింది. అయితే ఇదంతా నిజం కాదు. ప్రమోషనల్ టెక్నీక్. రాజ్ తరుణ్ లేటెస్ట్ మూవీ భలే ఉన్నాడే ప్రమోషన్స్ లో భాగంగా ఈ ప్రాంక్ చేశారు.
భలే ఉన్నాడు చిత్రంలో రాజ్ తరుణ్ నపుంసకుడు పాత్ర చేశాడు. ఆగస్టు 19న ట్రైలర్ విడుదల కాగా రాజ్ తరుణ్ రోల్, క్యారెక్టరైజేషన్ క్లియర్ గా అర్థం అవుతుంది. రాజ్ తరుణ్ ఈ చిత్రంలో సాహసోపేతమైన పాత్ర చేశాడు. రాజ్ తరుణ్ కి జంటగా మనీషా కంద్కూర్ నటించింది. ట్రైలర్ రొమాంటిక్, కామెడీ అంశాలతో సాగింది. భలే ఉన్నాడే చిత్రానికి జే శివ సాయి వర్ధన్ దర్శకుడు.
రవి కిరణ్ ఆర్ట్స్, మారుతీ టీమ్ సంయుక్తంగా నిర్మించారు. శేఖర్ చంద్ర మ్యూజిక్ అందించారు. త్వరలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా రాజ్ తరుణ్ వరుస చిత్రాలు చేస్తున్నారు. ఆయన నటించిన పురుషోత్తముడు, తిరగబడర సామీ వారం వ్యవధిలో విడుదలయ్యాయి. తిరగబడర సామీ ఆగస్టు 2న విడుదల కాగా... భలే ఉన్నాడే అంటూ మరో చిత్రంతో అలరించేందుకు సిద్ధం అయ్యాడు.