రాహుల్‌ సిప్లిగంజ్‌ భావోద్వేగ పోస్ట్ .. పునర్నవి మోసం చేసిందా?

Published : Oct 29, 2020, 09:36 PM IST
రాహుల్‌ సిప్లిగంజ్‌ భావోద్వేగ పోస్ట్ .. పునర్నవి మోసం చేసిందా?

సారాంశం

ఇప్పుడు పునర్నవి మరో వ్యక్తిని పెళ్ళి చేసుకోబోతున్నట్టు ప్రకటించడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా దీనిపై పునర్నవి ప్రియుడు రాహుల్‌ సిప్లిగంజ్‌ ఓ భావోద్వేగ పోస్ట్ పెట్టాడు. 

`బిగ్‌బాస్‌3` ఫేమ్‌, నటి పునర్నవి భూపాలం ఎంగేజ్‌మెంట్‌ అయ్యింది. యూట్యూబ్‌ పాపులర్‌ ఉద్భవ్‌తో ఆమె ఎంగేజ్‌మెంట్‌ అయినట్టు తెలిసింది. రేపు(శుక్రవారం) అన్ని వివరాలు వెల్లడిస్తామని పేర్కొంది. దీంతో ఆమె అభిమానులు మొత్తం షాక్‌ అయ్యారు. అయితే పునర్నవి, `బిగ్‌బాస్‌3` విన్నర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ మధ్య లవ్‌ ఎఫైర్‌ ఉందని, వీరి త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నట్టు ఆ మధ్య వార్తలొచ్చాయి. 

కానీ ఇప్పుడు పునర్నవి మరో వ్యక్తిని పెళ్ళి చేసుకోబోతున్నట్టు ప్రకటించడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా దీనిపై పునర్నవి ప్రియుడు రాహుల్‌ సిప్లిగంజ్‌ ఓ భావోద్వేగ పోస్ట్ పెట్టాడు. `నేను నా భయాలను మోసం చేశాను, నా సందేహాలు బ్రోక్‌ అయ్యాయి. నా విశ్వాసానికి నిశ్చితార్థం జరిగింది. ఇప్పుడు నేను నా కలలను మ్యారేజ్‌ చేసుకున్నా` అని ఎమోషనల్‌గా పోస్ట్ ని తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టేటస్‌లో పెట్టుకున్నారు. 

దీంతో ఇప్పుడి సోషల్‌ మీడియాలోవైరల్‌ అవుతుంది. దీన్ని బట్టి రాహుల్‌ సిప్లిగంజ్‌ని పునర్నవి మోసం చేసిందనే విషయం చెప్పకనే చెప్పేశారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 Winner Fix: బిగ్‌ బాస్‌ విన్నర్‌ ముందే ఫిక్స్.. అదే జరిగితే సరికొత్త హిస్టరీకి శ్రీకారం
Sara Arjun: ధురంధర్ స్టార్ సారా అర్జున్ రూ.12 కోట్ల లగ్జరీ ఫ్లాట్.. వైరల్ ఫోటోలు