ఓటీటీలో రాబోతున్న విజయ్‌సేతుపతి, మమ్ముట్టి సినిమాలు

Published : Oct 29, 2020, 08:32 PM ISTUpdated : Oct 29, 2020, 08:35 PM IST
ఓటీటీలో రాబోతున్న విజయ్‌సేతుపతి, మమ్ముట్టి సినిమాలు

సారాంశం

 మరో కొత్త ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ సంస్థ ప్రారంభం కానుంది. ఫిలిమ్‌ అనే ఓటీటీ సంస్థ క్రేజీ సినిమాలతో తన జర్నీని ప్రారంభించబోతుంది. బలమైన కంటెంట్‌తో కూడిన సినిమాలు, వెబ్‌ సిరీస్‌లను, ఇండిపెండెంట్‌ సినిమాలను అందించబోతుంది. 

థియేటర్లు మూత పడటంతో ఓటీటీలకు డిమాండ్‌ పెరిగింది. ఓటీటీలో విడుదల చేసేందుకు చాలా సినిమాలు ముందుకొచ్చాయి. వస్తున్నాయి. ఇటీవల థియేటర్లు ఓపెన్‌ చేసేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. కానీ థియేటర్లు ఓపెన్‌ చేసేందుకు ఎగ్జిబిటర్లు ముందుకు రావడం లేదు. దీంతో స్టార్‌ హీరోల సినిమాలు కూడా ఓటీటీలో విడుదలకు రెడీ అవుతున్నాయి. 

ఈ నేపథ్యంలో మరో కొత్త ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ సంస్థ ప్రారంభం కానుంది. ఇప్పటికే అమేజాన్‌ ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్, జీ5, ఆహా, శ్రేయాస్‌ఈటీ తోపాటు మరికొన్ని చిన్నా చితకా ఓటీటీలు తెలుగులో రాణిస్తున్నాయి. అందులో భాగంగా మరో ఓటీటీని తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది.  ఫిలిమ్‌ అనే ఓటీటీ సంస్థ క్రేజీ సినిమాలతో తన జర్నీని ప్రారంభించబోతుంది. బలమైన కంటెంట్‌తో కూడిన సినిమాలు, వెబ్‌ సిరీస్‌లను, ఇండిపెండెంట్‌ సినిమాలను అందించబోతుంది. కామెడీ, డ్రామాస్‌, థ్రిల్లర్స్ వంటి డిఫరెంట్‌ జోనర్‌ సినిమాలను ఆడియెన్స్ కి అందించేందుకు రెడీ అయ్యింది. 

ఈ `ఫిలిమ్‌` ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో విజయ్‌ సేతుపతి క్రైమ్‌ థ్రిల్లర్‌ `పిజ్ఙా 2`, `మమ్ముట్టి `రంగూన్‌ రౌడీ`, జె.డి చక్రవర్తి `మాస్క్`, నివిన్‌ పౌలీ-త్రిష ల `హే జూడ్‌` వంటి సినిమాలుఈ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో విడుదల కానున్నాయి. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 Winner Fix: బిగ్‌ బాస్‌ విన్నర్‌ ముందే ఫిక్స్.. అదే జరిగితే సరికొత్త హిస్టరీకి శ్రీకారం
Sara Arjun: ధురంధర్ స్టార్ సారా అర్జున్ రూ.12 కోట్ల లగ్జరీ ఫ్లాట్.. వైరల్ ఫోటోలు