Rahul Ramakrishna: స్టార్ కమెడియన్ షాకింగ్ నిర్ణయం.. ఇక సినిమాలకు దూరంగా రాహుల్ రామకృష్ణ.

Published : Feb 05, 2022, 11:57 AM IST
Rahul Ramakrishna: స్టార్ కమెడియన్ షాకింగ్ నిర్ణయం.. ఇక సినిమాలకు దూరంగా రాహుల్ రామకృష్ణ.

సారాంశం

టాలీవుడ్ యంగ్ స్టార్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ(Rahul Ramakrishna) ఇండస్ట్రీ వర్గాలకు షాక్ ఇచ్చాడు. ఆడియన్స్ తో పాటు అభిమానులు జీర్ణించుకోలేని ఓ షాకింగ్ న్యూస్ ను అనౌన్స్ చేశాడు.

టాలీవుడ్ యంగ్ స్టార్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ(Rahul Ramakrishna) ఇండస్ట్రీ వర్గాలకు షాక్ ఇచ్చాడు. ఆడియన్స్ తో పాటు అభిమానులు జీర్ణించుకోలేని ఓ షాకింగ్ న్యూస్ ను అనౌన్స్ చేశాడు.

చాలా షార్ట్ టైమ్ లో స్టార్ కమెడియన్ గా గుర్తింపు పొందాడు రాహుల్ రామకృష్ణ. (Rahul Ramakrishna) తెలంగాణ స్లాంగ్ తో.. తనదైన డైలాగ్ డెలివరీతో ఆడియన్స్ ను ఆకట్టుకున్నాడు. అప్పటికే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో యంగ్ కమెడియన్స్ రచ్చ రచ్చ చేస్తున్న టైమ్ లో.. మిసైల్ లా దూసుకు వచ్చి తన మార్క్ కామెడీతో అలరించిన రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna) షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు.

సోషల్ మీడియాలో షాకింగ్ పోస్ట్ పెట్టాడు రాహుల్(Rahul Ramakrishna). తాను ఇండస్ట్రీని వీడిపోతున్నట్టు తెలియజేశాడు. ఈ 2022 తరువాత తాను సినిమాలకు దూరం అవుతున్నట్టు ప్రకటించాడు. ఇప్పుడిప్పుడు పెద్ద సినిమాలతో  ఇండస్ట్రీలో కుదురుకుంటున్నాడు రాహుల్ (Rahul Ramakrishna). మంచి మంచి సినిమాలు తన చేతిలో ఉండగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. రకరకాలుగా స్పందిస్తున్నారు.  

 

మెకానిక‌ల్ ఇంజ‌రీనింగ్ చ‌దివిన రాహుల్ రామ‌కృష్ణ(Rahul Ramakrishna)  సినిమాల‌పై  ఇంట్రస్ట్ తో  ఇండ‌స్ట్రీకి రావాల‌నుకుని గట్టిగా  ప్ర‌య‌త్నాలు చేశాడు. 2014లో సైన్మా అనే షార్ట్ ఫిలింతో న‌టుడిగా ఎంట్రీ ఇచ్చారు. జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చాడు రాహులు.త‌ర్వాత 2017లో బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీగా నిలిచిన అర్జున్ రెడ్డిలో హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Devarakonda) ఫ్రెండ్ క్యారెక్టర్ లో.. మెప్పించి  మంచి గుర్తింపు పొందాడు.


కామెడీ అంటే మేన‌రిజ‌మ్‌తోనే న‌వ్వించాల‌ని కాకుండా సిట్యువేష‌న‌ల్ డైలాగ్స్‌తోనూ ఆక‌ట్టుకుంటూ, ప్రేక్ష‌కుల‌ను న‌వ్విస్తూ వ‌చ్చారు. క‌ల్కి, రీసెంట్‌గా రిలీజ్ అయిన స్కై లాబ్ వంటి సినిమాల్లో మంచి పాత్రలు ఆయనకు దక్కాయి. శ్రీమంతుడు లాంటి కొన్ని రేర్ సినిమాల్లో సీరియస్ క్యారెక్టర్స్ లో కూడా మెప్పించి నటుడిగా ఫ్రూ చేసుకున్నాడు రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna)  ప్రస్తుతం రాహుల్ నటించిన  ట్రిపుల్ ఆర్ (RRR), విరాట ప‌ర్వం లాంటి సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి.

అయితే రాహుల్ రామ‌కృష్ణ (Rahul Ramakrishna)  2022 త‌ర్వాత ఇక సినిమాల్లో న‌టించ‌ను అని ట్విట్టర్ లో  అనౌన్స్ చేయడంతో  నెటిజ‌న్స్ రకర‌కాలుగా రియాక్ట్ అవుతున్నారు. ఓ ర‌కంగా ట్రోల్ చేయ‌డం ప్రారంభించారు. బ్రో సీరియస్సా? అని ఒక‌రు.. ఏదో ప్రమోషన్ అనుకుంటా అని మరొకరు.. లేదు లేదు. కెరీర్ చేంజ్ అవుతాడేమో అని మరొకరు.. ఏంటి ప్రాంక్ చేస్తున్నారా ఇంకొకరు ఇలా రకరకాల స్పందనలు వినిపిస్తున్నాయి.. కనిపిస్తున్నాయి.  మరి వీటికి  రాహుల్ రామకృష్ణ(Rahul Ramakrishna)  ఎలా రియాక్ట్ అవుతాడో చూడలి.

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode: వైరాతో చేతులు కలిపిన జ్యోత్స్న- శ్రీధర్ ని కార్తీక్ కాపాడుతాడా?
Bigg Boss Telugu 9 విన్నర్‌లో మార్పు.. ఆడియెన్స్ ఓటింగ్‌తో పనిలేదా? అంతా వీళ్లదే నిర్ణయం