Allu Arjun Controversy: మరో వివాదంలో అల్లు అర్జున్.. నెటిజన్ల ఆగ్రహం

Published : Feb 05, 2022, 08:58 AM IST
Allu Arjun Controversy: మరో వివాదంలో అల్లు అర్జున్..  నెటిజన్ల ఆగ్రహం

సారాంశం

ఈ మధ్య ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun).. సూపర్ సక్సెస్ లతో పాటు వరుస కాంట్రవర్సీలను కూడా ఫేస్ చేస్తున్నారు. సినిమాలతో పాటు కమర్షియల్ యాడ్స్ చేస్తన్న బన్నీ.. నెటిజన్ల ఆగ్రహానికి గురవుతున్నారు.

ఈ మధ్య ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun).. సూపర్ సక్సెస్ లతో పాటు వరుస కాంట్రవర్సీలను కూడా ఫేస్ చేస్తున్నారు. సినిమాలతో పాటు కమర్షియల్ యాడ్స్ చేస్తన్న బన్నీ.. నెటిజన్ల ఆగ్రహానికి గురవుతున్నారు.

టాలీవుడ్ ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌(Allu Arjun) మరోసారి ట్రోల్స్‌ బారిన పడ్డాడు. అటు సినిమాలు ఇటు కమర్షియల్స్ తో బిజీ బిజీగా ఉన్న బన్నీ.. చేతినిండా సంపాదనలతో దూసుకు పోతున్నాడు. సక్సెస్ తో పాటు వివాదాలు కూడా చుట్టుముడుతున్నాయి అల్లు హీరో చుట్టూ. రీసెంట్ గా అల్ అర్జున్(Allu Arjun) చేసిన రెండు కమర్షియల్ యాడ్స్ కాంట్రవర్సీని క్రియేట్ చేశాయి. గతంలో రాపిడో.. ఇప్పుడు జుమాటో. ఈరెండు యాడ్స్ వల్ల నెటిజన్ల ట్రోలింగ్ కు బలైపోయారు బన్ని.

తాజాగా బన్నీ(Allu Arjun) నటించిన జోమాటో యాడ్‌పై నెటిజన్లు, సౌత్‌ సినీ ప్రియులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో బన్నీ చెప్పిన ఓ డైలాగ్‌పై సౌత్‌ ఇండియా సినిమా ప్రేమికులు  మండిపడుతున్నారు. అల్లు అర్జున్‌(Allu Arjun) రీసెంట్ గా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుబ్బరాజు(Subba Raju)  తో కలిసి ఓ  కమర్షియల్‌ యాడ్‌లో నటించాడు. ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జుమాటో యాడ్ లో స్టైలీష్ గా కనిపించాడు ఐకాన్ స్టార్.

ఈ యాడ్ లో ఇద్దరి మధ్య ఓ డిఫరెంట్  ఫైటింగ్ సీన్ ఉంటుంది. ఈవీడియోలో అల్లు అర్జున్ (Allu Arjun).. సుబ్బరాజు (Subba Raju) ను అమాంతం గాల్లోకి ఎత్తేస్తాడు. దీంతో తనను త్వరగా కిందకు దించాలని.. తనకు ఆకలిగా ఉందని సుబ్బరాజు అడుగుతాడు. అప్పుడు బన్నీ సౌత్ సినిమా కదా. ఎక్కువ సేపు ఎగరాలి అని డైలాగ్‌ చెబుతాడు. ఇప్పుడు ఇదే డైలాగ్  తీవ్ర దుమారాన్ని రేపుతోంది. బన్నిపై  విమర్శలకు కారణమయ్యింది.

ఈ డైలాగ్‌తో సౌత్ ఇండియా సినిమాలను బన్నీ కించపరిచాడంటూ సౌత్‌ సినీ జనాలు.. సినిమా అభిమానులు ఆగ్రహం వ్యాక్తంచేస్తున్నారు. సౌత్ సినిమా ఇండస్ట్రీలో ముఖ్యమైన భాగం టాలీవుడ్ నుంచి స్టార్ హీరోగా ఎదిగిన అల్లు అర్జున్ (Allu Arjun) ఈ డైలాగ్ ఎలా చెప్పగలిగారంటూ మండిపడుతున్నారు. సౌత్ మూలాలు మరిచిపోతే ఎలా.. అంటూ ఓ నెటిజన్ ఈ యాడ్‌పై గట్టిగానే కామెంట్‌ చేశాడు.

అల్లు అర్జున్‌ (Allu Arjun) సౌత్ సినిమాను అవమానించారంటూ.. జొమాటో యాప్‌ను అన్ఇన్‌స్టాల్‌ చేస్తున్నట్టు ట్వీట్‌లో మరో నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. ఇలా బన్నీ (Allu Arjun) మరోసారి నెటిజన్ల ఆగ్రహానికి కారణమయ్యాడు. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో రచ్చ రచ్చ అవుతోంది. ఈ విషయం ఇక్కడితో ఆగేట్టు కనినిపించడం లేదు.

ఇక గతంలోనూ.. బన్నీ మరో కమర్షియల్ యాడ్ విషయంలో విమర్షలు ఫేస్ చేశారు. ఆయన నటించిన ఓ యాడ్ వివాదానికి కారణమైంది. రాపిడో సంస్థకు చెందిన  ప్రకటనలో.. ఆర్టీసీని అవమానించారంటూ.. తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ విషయంలో  తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కూడా అల్లు అర్జున్ (Allu Arjun) పై  డైరెక్ట్ గా విమర్శలు చేశారు. వివరణ కోరుతూ బన్నీకి నోటీస్ లు కూడా ఇచ్చారు. ఇక  ఇప్పుడు అదే బన్నీ అంబాసిడర్ గా నటించిన జొమాటో యాడ్  విషయంలో కూడా వివాదం ముదురు తుంది. మరి దీనిపై  అల్లు అర్జున్ (Allu Arjun) రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode: వైరాతో చేతులు కలిపిన జ్యోత్స్న- శ్రీధర్ ని కార్తీక్ కాపాడుతాడా?
Bigg Boss Telugu 9 విన్నర్‌లో మార్పు.. ఆడియెన్స్ ఓటింగ్‌తో పనిలేదా? అంతా వీళ్లదే నిర్ణయం