విలన్ గా ప్రముఖ సింగర్!

Published : Jul 05, 2019, 09:55 AM IST
విలన్ గా ప్రముఖ సింగర్!

సారాంశం

ప్రముఖ సింగర్ రఘు కుంచె మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 

ప్రముఖ సింగర్ రఘు కుంచె మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు తనలోని కొత్త కోణాన్ని చూపించడానికి రెడీ అవుతున్నాడు. వెండితెరపై విలన్ గా కనిపించి షాక్ ఇవ్వబోతున్నాడు. 'పలాస 1978' సినిమాలో రఘు కుంచె విలన్ గా కనిపించబోతున్నాడు. 

అది కూడా నాలుగు డిఫరెంట్ షేడ్స్ లో అని తెలుస్తోంది. పెర్ఫార్మన్స్ కి బాగా స్కోప్ ఉన్న ఛాలెంజింగ్ పాత్రలో నటిస్తున్నారు. విలన్ గా నటించడంతో పాటు సినిమాకు మ్యూజిక్ కూడా కంపోజ్ చేస్తున్నారు. నాలుగు విభిన్న వయసులో రఘుకుంచె ఈ సినిమాలో కనిపించనున్నారు. 

30,40,50,70 సంవత్సరాల వయసులు కలిగిన వ్యక్తిగా రఘు కుంచె నటిస్తున్నారు. రియలిస్టిక్ క్రైమ్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రక్షిత్, నక్షత్ర జంటగా నటిస్తోన్న ఈ సినిమా పోస్టర్ తోనే షాకిచ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 

PREV
click me!

Recommended Stories

2026 కోసం రిషబ్ శెట్టి మాస్టర్ ప్లాన్ రెడీ.. జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయబోతన్నాడా?
సమంత, అఖిల్ అక్కినేనితో పాటు 2025లో పెళ్లి చేసుకున్న 10 జంటలు ఎవరో తెలుసా?