చెప్పింది చేసి చూపించిన లారెన్స్.. వృద్ధురాలికి స్వీట్ హోమ్

Published : May 20, 2019, 11:15 AM IST
చెప్పింది చేసి చూపించిన  లారెన్స్.. వృద్ధురాలికి స్వీట్ హోమ్

సారాంశం

మల్టి టాలెంటెడ్ సినీ సెలబ్రెటీ రాఘవ లారెన్స్ ఇతరులకు సహాయపడటంలో ఎప్పుడూ ముందుటుంటాడు. సహాయం చేస్తానని మాట ఇస్తే తప్పకుండా మాట నిలబెట్టుకునేందుకు లారెన్స్ ప్రయత్నిస్తాడు. ఒక వృద్ధురాలికి లారెన్స్ కట్టించిన ఇళ్లే అందుకు సాక్ష్యం.   

గత ఏడాది తమిళనాడులో గజ తుపాను కారణంగా  ఇల్లు పోగొట్టుకొని ఒక గుడిసెలో వృద్ధిరాలి దీన పరిస్థితిని చూసి లారెన్స్ చలించిపోయాడు. సోషల్ మీడియాలో ఆమెకు సంబందించిన వీడియోను చూసి వెంటనే ఆమెకు ఇల్లు కట్టిస్తాను అని మాట ఇచ్చాడు. ఇక ఇప్పుడు దాన్ని రుజువు చేసి చూపించి నిన్న అవ్వతో గృహ ప్రవేశం కూడా చేయించాడు. 

అందుకు సంబందించిన ఫొటోస్ ని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్న లారెన్స్ అమ్మకి ఇల్లు కట్టించినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నాడు. అదే విధంగా ఈ విషయాన్నీ తనవరకు తీసుకువచ్చిన బాయ్స్ కి ప్రత్యేక కృతజ్ఞతలని లారెన్స్ వివరణ ఇచ్చాడు.

PREV
click me!

Recommended Stories

Om Shanti Shanti Shantihi Trailer Review: తరుణ్‌ భాస్కర్‌ కి వణుకు పుట్టించిన ఈషా రెబ్బా, ట్రైలర్‌ ఎలా ఉందంటే?
Sobhita Dhulipala: శోభితకు ఇష్టమైన సినిమా అదే, ఆమె భర్త చైతూది మాత్రం కాదు