
బాలీవుడ్ హీరోయిన్ పరిణితీ చోప్రా.. ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా వ్యావహారం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మొదటి నుంచి స్నేహితులైన వీరు.. తమ స్నేహాన్ని ప్రేమగామలుచుకుని.. త్వరలో పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నట్టు తెలుస్తోంది. ఇక వీరు చెట్టా పట్టాలువేసుకుని తిరుగుతూ.. తరచూ మీడియా కెమెరాలకు చిక్కుతున్నారు. రెస్టారెంట్లకు, డిన్నర్ డేట్లకు వెళ్తూ.. కెమెరాల కళ్లల్లో పడుతున్నారు. కాని వీరి బంధం గురించి మాత్రం ఎక్కడా క్లారిటీ ఇవ్వలేదు స్టార్స్.
అయితే వీరిపెళ్లికి సన్నాహాలు జరుగుతున్నట్టు మాత్రం న్యూస్ వైరల్ అవుతోంది. ఈనెల 13న నిశ్చితార్థం చేసుకుని.. ఈ ఏడాది అక్టోబర్ లో పెళ్ళి చేసేందుకు పెద్దలు నిర్ణయించారని సమాచారం. ఇక ఇప్పటికే కలిసి చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్న ఈ జంట.. తాజాగామరోసారి సందడి చేశారు. ఐపీఎల్ మ్యాచ్ లో.. ఈసెలబ్రిటీ జంట హడావిడి చేశారు.
ఈసారి ఏకంగా ఐపీఎల్ మ్యాచ్లో కనిపించి అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు. పంజాబ్లోని మొహాలి వేదికగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్ కు ఈ స్టార్ ప్రేమజంట హాజరైంది. మొహాలిలో జరిగిన ఈ మ్యాచ్ లో మ్యాచ్ లో పంజాబ్-ముంబయి జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ఆడియన్స్ గ్యాలరీలో సందడి చేశారు స్టార్ లవర్స్. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను పరిణితీ చోప్రా తన ఇన్స్ స్టా స్టోరీస్ లో శేర్ చేసుకుంది. దాంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
గతంలో కూడా ఈ ఇద్దరు చాలా చోట్ల కలిసి కనిపించారు. ముందుగా బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా ఆప్ ఎంపీ రాఘవ చద్దాతో పరిణీతి ముంబయిలోని ఓరెస్టారెంట్లో కనిపించింది. ఇద్దరు బయటకు వస్తున్న వీడియోలు హల్ చల్ చేశాయి.దాంతో అంతా వీరిద్దరు ప్రేమలో మునిగి తేలుతున్నారంటూ జోరుగా ప్రచారం జరిగింది. మరి వీరి పెళ్ళికి సంబంధించిన అప్ డేట్ ను త్వరలో వెల్లడిస్తారేమో చూడాలి. అటు పరిణితీ చోప్రా కూడా బాలీవుడ్ లో పెద్దగా సినిమాలు లేవు.