
సౌత్ సీనియర్ నటుడు శరత్ బాబు మరణించారంటూ సోషల్ మీడియాతో పాటు.. పలు మీడియా సంస్థల్లో వార్తలు ప్రసారం అవ్వడంతో ఒక్క సారిగా ఇండస్ట్రీ ఉలిక్కి పడింది. ఈ వార్తలు వైరల్ అవ్వడంతో చాలా మంది స్టార్స్ సంతాపం కూడా తెలియజేశారు. కాని అవన్నీ పుకార్లే అని తేలడంతో.. అంతా ఊపిరి పీల్చుకున్నారు.
గత కొంత కాలంగా అనారోగ్యంతో హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు శరత్ బాబు. ప్రస్తుతం హైదరాబాద్ లోని AIG హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు శరత్ బాబు.కొన్ని రోజుల ముందు ఆయన ఆరోగ్యం బాగా క్షీనించడంతో.. చెన్నై నుంచి బెంగళూరుకు...బెంగళూరు నుంచి హైదరాబాద్ కు ఆయనన్ను తరలించారు. ఇక కొన్ని రోజుల క్రితం వరకూ శరత్ బాబు ఆరోగ్యం సీరియస్ గానే ఉందంటూ ప్రకటించారు డాక్టర్లు. అయితే శరత్ బాబు ఆరోగ్య పరిస్థితిపై తాజాగా పుకార్లు మొదల్యాయి.
శరత్ బాబు మరణించారని వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. కొన్ని మీడియా సంస్థలు కూడా ఈ వార్తలను ప్రముఖంగా ప్రసారం చేశాయి. దాంతో ఒక్క సారిగా అంతా ఉలిక్కి పడ్డారు. ఖుష్బు లాంటి స్టార్స్ అయితే శరత్ బాబుకు రిప్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు కూడా పెట్టారు. అయితే ఈ వార్తలపై శరత్ బాబు సోదరి స్పందించారు. అవన్నీ పుకార్లే అని.. వాటిని నమ్మొద్దంటూ.. మీడియాకు ఇన్ ఫర్మేషన్ ఇచ్చారు.
శరత్ బాబు సోదరి ఏమన్నారంటే.. సోషల్ మీడియా లో శరత్ బాబు గారి గురించి వచ్చే వార్తలు అన్ని తప్పుగా వస్తున్నాయి..శరత్ బాబు కొంచెం రికవరీ అయ్యారు. ఐసీయు నుంచి రూమ్ కు షిఫ్ట్ చేయడం జరిగింది..తొందరలోనే శరత్ బాబు గారు పూర్తిగా కోలుకొని మీడియాతో మాట్లాడుతారు అని ఆశిస్తున్నాను....సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు ఏవి నమ్మవద్దు అని నా విజ్ఞప్తి అంటూ.. ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు శరత్ బాబు సోదరి.
దాంతో సోషల్ మీడియాలో శరత్ బాబుపై వస్తున్న వార్తలకు .. కన్ ఫ్యూజన్ లో ఉన్న ఆయన ఫ్యాన్స్ కు క్లారిటీ ఇచ్చినట్టు అయ్యింది. 72 ఏళ్ళ శరత్ బాబు దాదాపు 200లకు పైగా సినిమాల్లో నటించారు. తెలుగులో కెరీర్ ను స్టార్ట్ చేసి.. తమిళ, కన్నడ, హిందీ సినిమాల్లో నటించారు. కొన్నాళ్ళు బెంగళూరులో ఉన్న ఆయన.. ఆతరువాత చెన్నైలో స్థిరపడ్డారు. టాలీవుడ్ సీనియర్ మోస్ట్ లేడీ కమెడియన్ రమా ప్రభతో ఆయనకు మొదటి వివాహం జరిగింది. ఆతరువాత కొన్నేళ్లకు వారు విడిపోయారు.