బీచ్ లో కూడా చీర కట్టుకొని తిరగాలా.?

Published : Mar 09, 2018, 07:00 PM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
బీచ్ లో కూడా చీర కట్టుకొని తిరగాలా.?

సారాంశం

నటి రాధికా ఆప్టే మరోమారు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది బీచ్‌లో బికినీతో ఉన్న ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసిన రాధిక మరోమారు ట్రోల్ అయింది​ బీచ్‌లో కూడా తాను చీర కట్టుకుని తిరగాలా అని ప్రశ్నించింది 

బాలీవుడ్ సంచలన నటి రాధికా ఆప్టే మరోమారు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. గోవా బీచ్‌లో బికినీతో ఉన్న ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసిన రాధిక మరోమారు ట్రోల్ అయింది. ఈ విషయమై ఓ పత్రికతో రాధిక మాట్లాడుతూ.. తనే ఎందుకు ట్రోల్ అవుతున్నానో తెలియడం లేదని వ్యాఖ్యానించింది. ఇది చాలా హాస్యాస్పదమని, బీచ్‌లో కూడా తాను చీర కట్టుకుని తిరగాలని వారు కోరుకుంటున్నారా? అని ప్రశ్నించింది.

 

తనను విమర్శిస్తున్న వారెవరో తనకు తెలియదని, అటువంటప్పుడు తానెందుకు పట్టించుకోవాలని ప్రశ్నించింది. ప్యాడ్‌మ్యాన్ సినిమాలో తన నటనకు సంబంధించి వస్తున్న రివ్యూలను ఇప్పటి వరకు చదవలేదని పేర్కొంది. అయితే తన నటన ప్రేక్షకులకు నచ్చిందన్న విషయం తెలుసని పేర్కొంది.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: ఇమ్మూ, తనూజ కాదు, కామనర్స్ టార్గెట్... సూట్ కేసు తెచ్చేది ఎవరు?
ట్రక్ డ్రైవర్ నుంచి వేలకోట్ల కలెక్షన్స్ రాబట్టే స్థాయికి ఎదిగిన డైరెక్టర్.. ప్రపంచం మొత్తం ఫిదా