ఒక సౌత్ స్టార్ హీరో చెంప పగలగొట్టా : రాధికా ఆప్టే

Published : Mar 14, 2018, 04:14 PM ISTUpdated : Mar 25, 2018, 11:51 PM IST
ఒక సౌత్ స్టార్ హీరో చెంప పగలగొట్టా : రాధికా ఆప్టే

సారాంశం

తన హాట్ కామెంట్స్ తో తరచూ వార్తల్లో నిలిచే రాధికా ఆప్టే మరోసారి ఆ తరహాలోనే మాట్లాడింది హీరోయిన్లను వివక్షాపూరితంగా చూస్తారని కూడా రాధిక వ్యాఖ్యానించింది​ బాలీవుడ్ నటి నేహా దూపియా నిర్వహించే టాక్ షోకు హాజరైన రాధిక ఘాటు వ్యాఖ్యలు చేసింది

తన హాట్ కామెంట్స్ తో తరచూ వార్తల్లో నిలిచే రాధికా ఆప్టే మరోసారి ఆ తరహాలోనే మాట్లాడింది. ఇది వరకూ దక్షిణాది చిత్ర పరిశ్రమపై హాట్ కామెంట్స్ చేసింది రాధిక. సౌత్ లో తను నటించిన సినిమాల హీరోల నుంచే తనకు లైంగిక వేధింపులు ఎదురయ్యాయని రాధిక ఆ మధ్య ప్రకటించింది. ఇక్కడ హీరోయిన్లను వివక్షాపూరితంగా చూస్తారని కూడా రాధిక వ్యాఖ్యానించింది. ఇలాంటి సంచలన కామెంట్లు చేస్తూ వస్తున్న రాధిక.. తను ఒక సౌత్ స్టార్ హీరో చెంప పగలగొట్టానని ప్రకటించుకుంది.

బాలీవుడ్ నటి నేహా దూపియా నిర్వహించే టాక్ షోకు హాజరైన రాధిక అక్కడ ఈ కామెంట్లు చేసింది. తను నటించిన తొలి దక్షిణాది సినిమాలో హీరోను తను కొట్టానని రాధిక చెప్పింది. ఆ సినిమా షూటింగ్ స్పాట్ కు వెళ్లిన తొలి రోజే ఆ హీరో తనతో అనుచితంగా ప్రవర్తించాడని, పక్కన వచ్చి కూర్చుని తన కాలిని అతడి కాలితో రుద్దసాగాడని.. కనీసం పరిచయం కూడా లేని తనతో అతడు అలా ప్రవర్తించడంతో తన కోపం హద్దులు దాటేసిందని రాధిక చెప్పుకొచ్చింది. వేరే ఆలోచన లేకుండా అతడి చెంప చెల్లుమనిపించాను అని రాధిక అంది.

అతడు ఒక స్టార్ హీరో అని.. చెప్పిన రాధిక అతడి పేరును మాత్రం చెప్ప లేదు. దక్షిణాదిన ఈమె ప్రముఖ హీరోల సరసన నటించింది. తొలి సినిమా సమయంలోనే ఈ చేదు అనుభవం ఎదురైందని ఈమె అంటోంది.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?