Radhe Shyam: తెలంగాణలో రాధే శ్యామ్ 5 షోలకు అనుమతి.. మొదటి షో ఎక్కడంటే..

Sreeharsha Gopagani   | Asianet News
Published : Mar 10, 2022, 05:01 PM IST
Radhe Shyam: తెలంగాణలో రాధే శ్యామ్ 5 షోలకు అనుమతి.. మొదటి షో ఎక్కడంటే..

సారాంశం

రాధే శ్యామ్ చిత్రాన్ని 5 షోలు ప్రదర్శించుకునేలా తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. హైదరాబాద్ లో శుక్రవారం తెల్లవారు జాము నుంచే రాధే శ్యామ్ బెనిఫిట్ షోలు ప్రారంభం కానున్నాయి.   

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ చిత్రం ఈ శుక్రవారం గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. సినిమాపై ఇప్పటికే ఒక రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. చాలా కాలం తర్వాత ప్రభాస్ నటిస్తున్న ప్రేమ కథా చిత్రం ఇది.  రాధే శ్యామ్ మూవీ థ్రిల్లింగ్ అంశాలతో కూడిన ప్రేమ కథ. ఈ చిత్రంలో ప్రభాస్ పామ్ ఆర్టిస్ట్ ( హస్తసాముద్రిక నిపుణుడు) గా నటిస్తున్నాడు.

రాధే శ్యామ్ చిత్రానికి వరుసగా గుడ్ న్యూస్ లు ఎదురవుతున్నాయి. ఇటీవల ఏపీ ప్రభుత్వం టికెట్ ధరలు పెంచుతూ జీవో విడుదల చేసింది. తెలంగాణలో 5 షోలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మొదటి వారంలో 5 షోలు ప్రదర్శించుకునేలా తెలంగాణ ప్రభుత్వం రాధే శ్యామ్ చిత్రాన్ని వీలు కల్పించింది. 

ఇక తెలుగు రాష్ట్రాల్లో రాధే శ్యామ్ మూవీ మొదట ఆట ఎక్కడ ప్రదరిస్తారో అనే ఆసక్తిగా కూడా ప్రభాస్ అభిమానుల్లో ఉంది. హైదరాబాద్ కూకట్ పల్లి లోని అర్జున్ థియేటర్ లో శుక్రవారం తెల్లవారుజామున రాధే శ్యామ్ మొదటి ఆట ఉండబోతున్నట్లు చెబుతున్నారు. ఇక యూఎస్ లో కూడా ప్రీమియర్ షోలకు రంగం సిద్ధం అవుతోంది. 

ఇదిలా ఉండగా ఏపీలో పెంచిన టికెట్ ధరలకు సంబంధించిన టెక్నికల్ సమస్య కారణంగా బుకింగ్స్ ఇంకా ఓపెన్ కాలేదు. దీనితో ఏపీలో ప్రభాస్ అభిమానులు టికెట్స్ కోసం పడిగాపులు కాస్తున్నారు. ఏది ఏమైనా రాధే శ్యామ్ చిత్రం భారీ అంచనాల నడుమ మరి కొన్ని గంటల్లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

బాలయ్యతో చేసిన ఆ సినిమా నా కెరీర్‌లో బిగ్గెస్ట్ మిస్టేక్.. ఓపెన్‌గా చెప్పేసిన స్టార్ హీరోయిన్
విజయ్ దళపతి ఆడియన్స్ సహనాన్ని పరీక్షించబోతున్నాడా? జన నాయగన్ రన్ టైమ్ చూసి అభిమానులు షాక్