
దీపం ఉన్నప్పుడే ఇల్లు చెక్కబెట్టుకోవాలనేది చాలా మంది సెలబ్రెటీలు అవలంబిస్తున్న సిద్దాంతం. తమకు క్రేజ్ ఉన్నప్పుడే దాన్ని క్యాష్ చేసుకోవాలనే పద్దతిలో పరుగులు పెడుతున్నారు. షాప్స్ ఓపినింగ్సం వంటివే కాక, ఇప్పుడు యూట్యూబ్ ఛానెల్స్ వంటివి పెడుతున్నారు. సోషల్ మీడియాని డబ్బులు సంపాదనకు మార్గం గా ఎంచుకుంటున్నారు.
దాదాపు సెలబ్రిటీలు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. అందులో భాగంగానే పలు సోషల్ మీడియాల్లో ఖాతాలను తెరుస్తూ నిత్యం తమ ఫ్యాన్స్ కు టచ్‌లో ఉంటున్నారు. ఇక ఆయా సోషల్ మీడియా ద్వారా వారు డబ్బులు కూడా సంపాదిస్తున్నారు. ఒక్క పోస్ట్ పెట్టి రూ.లక్షలు సంపాదిస్తున్నారు. ఈ క్రమంలో రాశి ఖన్నా కూడా సొంత యూట్యూబ్ చానల్‌ను స్టార్ట్ చేసింది. తన మొదటి వీడియోలో ఆమె ఏం చెప్పిందో చూడండి..
తన పర్శనల్ లైఫ్ లోని కొన్ని గ్లిప్స్ ని వీడియోస్ ద్వారా అభిమానులకు అందిస్తానంటోంది. ఆమె తన రోజువారీ కార్యకలాపాలు, ఆహారపు అలవాట్లు, చిన్ననాటి జ్ఞాపకాలు, మేకప్ రహస్యాలు, ప్రయాణ డైరీలు మరియు ఇతర అంశాలను పంచుకుంది. వీటిని ఎంజాయ్ చేస్తూ లైక్ చేసి, సబ్ స్క్రైబ్ చేసి, షేర్ చేయమని అడుగుతోంది. రాశి ఖన్నాకు ఇప్పటికే ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ లలో లక్షలకొద్దీ ఫాలోవర్లు ఉన్నారు. ఈ క్రమంలోనే ఆమె ఇలా యూట్యూబ్ చానల్‌ను ప్రారంభించింది.
రాశిఖన్నా ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. నాగచైతన్య సరసన ఆమె థాంక్ యూ అనే చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే ప్రముఖ బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్‌తో కలిసి రుద్ర అనే థ్రిల్లర్ సిరీస్‌లోనూ ఆమె నటిస్తోంది.