బాయ్ ఫ్రెండ్ ని వెంటబెట్టుకొని షూటింగ్ కి వస్తోన్న హీరోయిన్!

By Udayavani DhuliFirst Published Feb 1, 2019, 12:16 PM IST
Highlights

తమిళంలో హీరోయిన్ గా సినిమాలు చేసిన రాయ్ లక్ష్మీ తెలుగులో 'ఖైదీ నెంబర్ 150', 'సర్దార్ గబ్బర్ సింగ్' వంటి చిత్రాల్లో ఐటెం సాంగ్స్ లో నటించి బాగానే ఫేమస్ అయింది. 

తమిళంలో హీరోయిన్ గా సినిమాలు చేసిన రాయ్ లక్ష్మీ తెలుగులో 'ఖైదీ నెంబర్ 150', 'సర్దార్ గబ్బర్ సింగ్' వంటి చిత్రాల్లో ఐటెం సాంగ్స్ లో నటించి బాగానే ఫేమస్ అయింది. ఇటీవల హిందీలో 'జూలీ' సీక్వెల్ లో నటించింది.

ఈ సినిమాతో బాలీవుడ్ లో సెటిల్ అవుదామని అనుకున్న ఆమె ఆశలు నెరవేరలేదు. ప్రస్తుతం ఈమె తెలుగులో 'వేర్ ఈజ్ వెంకటలక్ష్మి' సినిమాలో నటిస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ జరిగినన్ని రోజులు కూడా రాయ్ లక్ష్మీతో పాటు ఒక వ్యక్తి షూటింగ్ కి వచ్చేవాడట.

ఆమె బంధువర్గానికి చెందిన వ్యక్తి అయి ఉంటాడని మొదట్లో ఎవరూ పట్టించుకోలేదట. కానీ అతడితో ఆమె సాన్నిహిత్యం, బాడీ లాంగ్వేజ్ వేరుగా అనిపించడంతో విషయం ఏంటని ఆరా తీయగా, బాయ్ ఫ్రెండ్ అని తేలిందట.

గతంలో కూడా రాయ్ లక్ష్మి కొంతమందితో డేటింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అందులో ప్రముఖ క్రికెటర్ పేరు కూడా ఉంది. తాజాగా ఈ బ్యూటీ మరోసారి ప్రేమలో పడినట్లుంది. అయితే ఈ విషయాన్ని అధికారికంగా చెప్పే అవకాశం లేదనే చెప్పాలి.  

click me!