పవన్ ఫ్యాన్స్ ని భయపెడుతున్న 'ఎక్స్ట్రా'.. వరుస ఫ్లాపులతో మారిపోయిన పరిస్థితి

Published : Dec 10, 2023, 08:23 PM IST
పవన్ ఫ్యాన్స్ ని భయపెడుతున్న 'ఎక్స్ట్రా'.. వరుస ఫ్లాపులతో మారిపోయిన పరిస్థితి

సారాంశం

యంగ్ హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ దారుణమైన డిజాస్టర్ దిశగా వెళుతోంది. డిసెంబర్ 8న రిలీజైన ఈ చిత్రం తొలి షో నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది.

యంగ్ హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ దారుణమైన డిజాస్టర్ దిశగా వెళుతోంది. డిసెంబర్ 8న రిలీజైన ఈ చిత్రం తొలి షో నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. కామెడీ ప్రధాన బలంగా తెరకెక్కిన ఈ చిత్రం పై అటు నితిన్, ఇటు వక్కంతం వంశీ బోలెడు ఆశలు పెట్టుకున్నారు. 

ఒకటి రెండు ఫన్నీ సీన్స్ తప్పితే రచయితగా వక్కంతం వంశీ మార్క్ ఎక్కడా కనిపించలేదు. ఇక దర్శకుడిగా తీవ్రంగా నిరాశపరిచారు. నితిన్ తన భుజాలపై సినిమా మొత్తాన్ని మోసినప్పటికీ ఫలితం లేకపోయింది. 

వక్కంతం వంశీకి దర్శకుడిగా నాపేరు సూర్య  తర్వాత ఎక్స్ట్రాతో మరో షాక్ తగిలింది. ఇక తన బలమైన రైటింగ్ లోనూ క్రమంగా పట్టు కోల్పోతున్నారు. ఏజెంట్ చిత్రం డిజాస్టర్ అయినప్పటికీ ఆ విమర్శలన్నీ సురేందర్ రెడ్డి వైపు వెళ్లాయి. కానీ ఇప్పుడు ఆయన దొరికిపోయారు. 

ఈ తరుణంలో పవన్ కళ్యాణ్, సురేందర్ రెడ్డి మూవీ విషయంలో పవన్ ఫ్యాన్స్ లో అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే ఈ చిత్రానికి కూడా కథ అందిస్తోంది వక్కంతం వంశీనే. రేసుగుర్రం, టెంపర్ తర్వాత వక్కంతం వంశీకి రచయితగా కూడా హిట్ లేదు. ఆయన కథలు అందించిన చిత్రాలన్నీ బోల్తా కొడుతున్నాయి. పవన్ సురేందర్ రెడ్డి చిత్రం ఇప్పట్లో ప్రారంభం అయ్యే సూచనలు కనిపించడం లేదు కానీ.. ఒక వేళ ఈ మూవీ పట్టాలెక్కితే మాత్రం స్క్రిప్ట్ ని సురేందర్ రెడ్డి రీ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉందని ఫ్యాన్స్ అంటున్నారు. 

ఎక్స్ట్రా రిలీజ్ కి ముందే వక్కంతం వంశీ స్వయంగా ఈ చిత్రం గురించి చెబుతూ పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఇంట్రెస్ట్ చూపించిన కథ అని హైప్ ఇచ్చారు. కానీ ఎక్స్ట్రా రిలీజ్ అయ్యాక ఆయన మాటలపై ఫ్యాన్స్ లో నమ్మకం ఉండడం లేదు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా