
ఇండియన్ మల్టీప్లెక్స్ లో పీవీఆర్ మొదటి స్థానంలో ఉంది. ఇంకా చెప్పాలంటే సినిమాలను శాషించే స్థాయిలో ఉంది. ఈ మల్టీప్లెక్స్ లు ఇండియాలోని మెయిన్ సిటీస్‌లో అందుబాటులో ఉంటాయి. అయితే తాజాగా పీవీఆర్ నిర్వహకులు సినీ లవర్స్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. టికెట్ల స్థానంలో పాస్‌పోస్ట్ లు తీసుకొస్తుంది. దీనికి ప్రత్యేకంగా ఒక ప్యాకేజీని రూపొందించింది.
సౌత్ ఇండియాలో ఈప్రయోగం చేస్తుంది పీవీఆర్. దీని లెక్క ప్రకారం టికెట్ ఉండదు, పాస్ పోర్ట్ లు మాత్రమే ఉంటాయి. `పీవీఆర్ పాస్ట్ పోర్ట్` ల పేరుతో పీవీఆర్ దీన్ని విక్రయిస్తుంది. ఇందులో నెలకు నాలుగు సినిమాలు చూసుకునే అవకాశం కల్పిస్తుంది. ఒక పాస్ పోర్ట్ కొంటే నెలకు నాలుగు సినిమాలను ఫ్రీగా చూసుకోవచ్చు. అలాగే ఇందులో పలు రకాలు ఉన్నాయి.
పాస్‌పోర్ట్ 1ప్రకారం.. దీని కాస్ట్ 349 రూపాయలు. ముప్పై రోజుల వరకు వాలిడేషన్ ఉంటుంది. ఈ ముప్పై రోజుల్లో నాలుగు సినిమాలు చూసుకోవచ్చు. అయితే సోమవారం నుంచి గురువారం వరకే ఇది చెల్లుబాటులో ఉంటుంది. శుక్రవారి, శని, ఆదివారం పనిచేయదు. నెలకు నాలుగు సినిమాలను ఆ రోజుల్లో ఎప్పుడైనా చూడొచ్చు.
పాస్‌పోర్ట్ 2.. దీని విలువ 1047 రూపాయలు. ఇది 90 రోజుల వరకు పనిచేస్తుంది. 12 సినిమాలు చూసుకోవచ్చు. ఇది కూడా సోమవారం నుంచి గురువారం వరకు మాత్రమే పనిచేస్తుంది. శుక్ర, శని, ఆదివారాల్లో పనిచేయదు. ఎందుకంటే ఆయా రోజుల్లో కొత్త సినిమాలు విడుదలవుతుంటాయి. కొత్త సినిమాల హడావుడి ఉంటుంది.పైగా వీకెండ్ కాబట్టి, ఆడియెన్స్ రద్దీ ఉంటుంది. దీంతో ఆ రోజుల్లో సినిమా చూడాలంటే డబ్బులు పెట్టుకుని చూడాలి.
ఇది తెలంగాణలో వరంగల్, ఆర్మూర్, ఏపీలో గుంటూరు, కాకినాడ, కర్నూల్, నర్సిపట్నం, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, తమిళనాడులో చెన్నై, కొయంబత్తూర్, కుద్దలోర్, మధురై, సలేం, వేలూర్, కర్నాటకలో.. బెంగుళూరు, బెల్గమ్, ధర్వాద్, హుబ్లీ, మంగళూర్, మనిపాల్, మైసూర్, తుమకూర్, కేరళాలో..త్రివేండ్రం, కొచ్చి, త్రిసూర్‌తోపాటు పాండిచ్చెరిలో ఈ పీవీఆర్ పాస్‌పోర్ట్ లు పనిచేయబోతున్నాయి. హైదరాబాద్‌లో ఇది ఇప్పటికే రన్నింగ్‌లో ఉన్నట్టు తెలుస్తుంది.