Pushpa Final Collections: “పుష్ప” థియేట్రికల్ రన్ ఫైనల్ కలెక్షన్స్

Surya Prakash   | Asianet News
Published : Jan 17, 2022, 04:36 PM IST
Pushpa Final  Collections: “పుష్ప” థియేట్రికల్ రన్ ఫైనల్ కలెక్షన్స్

సారాంశం

 దాదాపు  `పుష్ప` థియేట్రికల్ రన్  క్లోజింగ్ కు వచ్చేసినట్లే.  ఈ మూవీ విడుదలై ఈ సోమవారం అంటే జనవరి 17కు నెలరోజులు కావస్తోంది. ఈ నేపధ్యంలో చిత్రం ఫైనల్ రన్ కలెక్షన్స్ చూద్దాం.  


అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన సినిమా పుష్ప. తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ డిసెంబర్ 17న విడుదలైన ఈ చిత్రానికి మంచి టాక్ వచ్చింది. దానికి తగ్గట్లుగానే కలెక్షన్స్ కూడా వచ్చాయి. అఫీషియల్ గా 300 కోట్ల గ్రాస్ ఈ సినిమా వసూలు చేసిందని నిర్మాతలు ప్రకటించారు కూడా. పుష్ప సినిమాకు కలెక్షన్స్‌తో పాటు ప్రశంసలు కూడా అలాగే వస్తున్నాయి. చూసిన ప్రతీ ఒక్కరు సినిమాలో అల్లు అర్జున్ నటన అద్భుతం అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.  రీజినల్ మూవీగా విడుదలై నేషనల్ లెవెల్లో వాసూళ్లు కురిపించిన ఈ చిత్రం హవా... ఓటీటీ లో రిలీజ్  తగ్గిపోయింది. దాదాపు  `పుష్ప` థియేట్రికల్ రన్  క్లోజింగ్ కు వచ్చేసినట్లే.  ఈ మూవీ విడుదలై ఈ సోమవారం అంటే జనవరి 17కు నెలరోజులు కావస్తోంది. ఈ నేపధ్యంలో చిత్రం ఫైనల్ రన్ కలెక్షన్స్ చూద్దాం.

నైజామ్ : 39 కోట్ల షేర్
సీడెడ్  : 15.80 కోట్ల షేర్
ఆంధ్రా : 30 కోట్ల షేర్
కేరళ : 11. 50 కోట్లు నెట్
కర్ణాటక : 9.30 కోట్ల షేర్
తమిళనాడు : 22 కోట్ల గ్రాస్
నార్త్ ఇండియా : 85 కోట్లు నెట్
యుఎస్ ఏ 2.4 మిలియన్ గ్రాస్ వసూలు చేసింది.


డిసెంబర్ 17న విడుదలైన ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. అయితే ఆంధ్రాలో టికెట్ రేట్లు తగ్గించడం ఈ సినిమాకు శాపంగా మారింది. ఆంధ్రా సీడెడ్ ఏరియాల్లో ఈ మూవీ భారీగా నష్టాలని చవిచూడాల్సి వచ్చింది.

ఏదైమైనా  పుష్పరాజ్ గా అల్లు అర్జున్ ఒన్ మేన్ షో చేశాడు. రాయలసీమ డిక్షన్, పుష్పరాజ్ గా అతడి పెర్ఫార్మెన్స్ నభూతో నభవిష్యతి అన్న రీతిలో సాగింది. ఇంతకు ముందు అల్లు అర్జున్ ను ఇలాంటి పాత్రలో చూసి ఉండని అభిమానులకి ఈ సినిమా .. ప్రీరిలీజ్ ఈవెంట్ లో  సునీల్ అన్నట్టు నిజంగా పెళ్ళి తర్వాత వచ్చే రిసెప్షన్ భోజనం లాంటిదే అనిపించింది.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా