అల్లు అర్జున్‌ కే షాకిస్తున్న బాలీవుడ్‌.. `అల వైకుంఠపురములో` మళ్లీ రిలీజ్‌.. హవా మామూలుగా లేదుగా

Published : Jan 17, 2022, 04:13 PM IST
అల్లు అర్జున్‌ కే షాకిస్తున్న బాలీవుడ్‌.. `అల వైకుంఠపురములో` మళ్లీ రిలీజ్‌.. హవా మామూలుగా లేదుగా

సారాంశం

అల్లు అర్జున్‌ నటించిన `పుష్ప` చిత్రం బాలీవుడ్‌లో సంచలన విజయం సాధించింది. దీంతో ఇప్పుడు బన్నీ నటించిన మరో సినిమాల హిందీలో రిలీజ్‌ కాబోతుంది. 

ఐకార్‌ స్టార్‌ అల్లు అర్జున్‌(Allu Arjun) `పుష్ప`(Pushpa)కి ముందు సౌత్‌కే పరిమితం. నార్త్ వైపు ఆయన  చూసింది లేదు. తెలుగు తర్వాత కేరళాలో మంచి మార్కెట్‌ ఉంది. ఆయన్ని మల్లు  స్టార్‌గా పిలుచుకుంటారు అక్కడి  అభిమానులు. కన్నడ,  తమిళంలోనూ అంతంత మాత్రమే. కానీ `పుష్ప` చిత్రం మాత్రం అన్ని లెక్కలను తారుమారు చేసింది. ఊహించని విధంగా సౌత్‌ కంటే నార్త్ లో బన్నీకి భారీ మార్కెట్‌ ఏర్పడటం విశేషం. బన్నీ నటించిన `పుష్ప` చిత్రం హిందీలో ఏకంగా ఎనభై కోట్లకుపైగా కలెక్షన్లని రాబట్టడం విశేషం. 

బాలీవుడ్‌ కలెక్షన్లు చూసి `పుష్ప` టీమ్‌, అల్లు అర్జున్‌ మాత్రమే కాదు, ఏకంగా బాలీవుడ్‌ సినీ విశ్లేషకులు, అక్కడి మేకర్స్ సైతం షాక్‌కి గురవుతున్నారు. బన్నీ హవా చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇటీవల కాలంలో ఈ రేంజ్‌ కలెక్షన్లు బాలీవుడ్‌ చిత్రాలకు కూడా సాధ్యం కాని నేపథ్యంలో ఇప్పుడు అల్లు అర్జున్‌ నటించిన Pushpa చితం భారీ సక్సెస్‌ని సొంతం చేసుకుంది. ఇప్పుడు నార్త్ లో  Allu Arjun కి మంచి మార్కెట్‌ ఏర్పడింది. దీంతో ఆయన నటించిన మరో సినిమాని హిందీలో రిలీజ్‌ చేయబోతున్నారు. 

కారోనా కారణంగా హిందీ సినిమాలు వాయిదా పడ్డాయి. రిలీజ్‌ చేసేందుకు పెద్ద సినిమాలు సుముఖత చూపడం లేదు. దీంతో బన్నీ నటించిన మరో బ్లాక్‌బస్టర్‌ `అల వైకుంఠపురములో`(Ala Vaikuntapuramulo) చిత్రాన్ని హిందీలో రిలీజ్‌ చేయబోతున్నారు. ఈ సినిమాని హిందీలో డబ్‌ చేసి జనవరి 26న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. బన్నీ ఊపు  నార్త్ లో కొనసాగుతున్న నేపథ్యంలో ఆ క్రేజ్‌ని క్యాష్‌ చేసుకోవాలని భావిస్తుంది యూనిట్‌. దీంతో హిందీ భాషలోకి డబ్‌ చేసి ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని సినీ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ ట్విట్టర్‌ ద్వారా పంచుకున్నారు. `'పుష్ప` ప్ర‌భంజ‌నం త‌ర్వాత అల్లు అర్జున్‌ `అల వైకుంఠ‌పుర‌ములో` సినిమాతో మ‌రోసారి థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నున్నాడు. తెలుగులో హిట్ అయిన‌ ఈ సినిమా హిందీ డ‌బ్బింగ్ వ‌ర్ష‌న్ జ‌న‌వ‌రి 26న రిలీజ్ కానుంది' అని పేర్కొన్నాడు.

బన్నీ,  పూజా హెగ్డే జంటగా, త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని  హారికా అండ్‌ హాసిని, గీతా ఆర్ట్స్ పతాకాలపై ఎస్‌ రాధాకృష్ణ, అల్లు అరవింద్‌ సంయుక్తంగా నిర్మించారు. సంక్రాంతి కానుకగా  2020 జనవరి 12న విడుదలైంది. గత వారంలోనే ఇది రెండేళ్లు  పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగానూ చిత్ర బృందం హడావుడి చేసింది. పూజా హెగ్డే సైతం అల్లు అర్జున్‌ కూతురు అల్లు అర్హతో మేకప్‌రూమ్‌లో డాన్సు చేసిన ఫన్నీ వీడియోని పంచుకోగా అది విపరీతంగా వైరల్‌ అయ్యింది. మరోవైపు ఈ సినిమా 200కోట్లకుపైగా కలెక్షన్లని రాబట్టి  నాన్‌ బాహుబలి రికార్డ్ లు సృష్టించింది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా