Kanika Kapoor: 43ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకున్న పుష్ప సింగర్... ముగ్గురు పిల్లల తల్లి అనూహ్య నిర్ణయం!

Published : May 21, 2022, 10:59 AM IST
Kanika Kapoor: 43ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకున్న పుష్ప సింగర్... ముగ్గురు పిల్లల తల్లి అనూహ్య నిర్ణయం!

సారాంశం

43 ఏళ్ల వయసులో రెండో వివాహం చేసుకుంది స్టార్ లేడీ సింగర్ కనికా కపూర్. లండన్ కి చెందిన వ్యాపారవేత్తతో ఆమె వివాహ వేడుక అత్యంత సన్నిహితుల మధ్య జరిగింది.   

బాలీవుడ్ స్టార్ సింగర్స్ లో ఒకరైన కనికా కపూర్ (Kanika Kapoor) కొత్త జీవితంలో అడుగుపెట్టారు. లేటు వయసులో ఆమె రెండో వివాహం చేసుకున్నారు. 43 ఏళ్ల కనికా కపూర్ కి ముగ్గురు పిల్లలు ఉన్నారు.  లండన్‌లోని ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో వ్యాపారవేత్త గౌతమ్‌ హతిరమని ని ఆమె పెళ్లాడింది. శుక్రవారం జరిగిన ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

1998లో రాజ్ ఛన్దోక్ తో ఆమెకు వివాహం జరిగింది. అప్పటికి ఆమె వయసు కేవలం 18 ఏళ్ళు మాత్రమే. వివాహం అనంతరం ఆమె లండన్‌ వెళ్లి స్థిరపడ్డారు. మొదటి భర్తతో ఆమెకు ఆయనా, సమర, యువరాజ్‌ అని ముగ్గురు సంతానం కలిగారు.  మనస్పర్థలు రావడంతో భర్త రాజ్ ఛన్దోక్ నుండి 2012లో విడాకులు తీసుకున్నారు.  అప్పటినుంచి పిల్లల బాధ్యతను కనికానే చూసుకుంటోంది. లక్నోలో పెరిగిన ఆమె అప్పుడప్పుడూ తన తల్లిదండ్రులను చూసేందుకు భారత్‌కు వస్తూ ఉంటుంది. కాగా కనికా.. బేబీ డాల్‌, చిట్టియక్కలాయాన్‌, టుకుర్‌ టుకుర్‌, జెండా ఫూల్‌ పాటలతో జనాలను ఉర్రూతలూగించింది. ఇటీవల పుష్ప (Pushpa Movie) మూవీలో ఊ బోలెగా యా.. ఉఊ బోలేగా సాంగ్‌తో అలరించింది. సరిగ్గా ఇదే తరహాలో తెలుగు సింగర్ సునీత 42  ఏళ్ల వయసులో రెండో వివాహం చేసుకున్నారు. 

ఇక 2020 మార్చ్ నెలలో కరోనా బారినపడిన కనికా కపూర్ కోవిడ్ బారిన పడ్డారు. చావు అంచుల వరకు వెళ్లొచ్చిన కనిక మానసిక వేదనకు గురయ్యారు. అలాగే ఆమె విమర్శల పాలయ్యారు. లండన్ నుండి ఇండియా వచ్చిన కనికా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కి పార్టీ ఇచ్చారు. అలాగే ఆమె రెండు మూడు పార్టీలలో పాల్గొన్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో నెటిజెన్స్ ఆమెపై విరుచుకుపడ్డారు. కనీస బాధ్యత లేకుండా, విదేశాల నుండి వచ్చిన కనిక పార్టీలలో పాల్గొన్నారని విమర్శించారు. 

PREV
click me!

Recommended Stories

Chiranjeevi, Mahesh Babu సినిమాలతో పోటీ పడి టాప్ 5లో నిలిచిన హీరో, టాలీవుడ్ రాజకీయాలపై ఓపెన్ కామెంట్స్
Thalapathy Vijay సినిమా స్టోరీ లీక్, జన నాయగన్ కథ ఇదేనా? షాక్ లో మూవీ టీమ్