pushpa:'పుష్ప 'ఐటమ్‌ సాంగ్. ఆ పాటకు కాపీనా? నిజం ఎంత

Surya Prakash   | Asianet News
Published : Dec 11, 2021, 01:20 PM IST
pushpa:'పుష్ప 'ఐటమ్‌ సాంగ్. ఆ పాటకు కాపీనా? నిజం ఎంత

సారాంశం

యూట్యూబ్ లో వీడియోలు వదులుతున్నారు. ఓ రేంజిలో ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ దేవి కాపీ కొట్టాడంటారా లేదా అంటే రెండు పాటలు విని మీరే డిసైడ్ చేయండి.  

ఏదైనా పెద్ద సినిమా వస్తోందంటే అందులో పోస్టర్, షాట్స్, ట్యూన్స్ అన్నీ అందరూ చాలా నిశిత దృష్టిలో పరిశీలిస్తూంటారు. అంతేకాదు యాంటి హీరో ఫ్యాన్స్ ఏదన్నా ఆధారం దొరికితే ట్రోలింగ్ చేసేస్తూంటారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కోసారి ట్రోలింగ్ మొదలైపోతుంది. ఎక్కడో చోట కాపీ అనో మరొకటి అనో సోషల్ మీడియా జనం రచ్చ రచ్చ చేస్తూంటారు.

ఇక అల్లు అర్జున్-సుకుమార్-దేవిశ్రీప్రసాద్ అంటేనే పక్కా ఐటెం ఉంటుందనే విషయం తెలిసిందే.ఈ  కాంబోలో వచ్చిన ఐటం సాంగ్స్ అన్నీ సెన్సేషన్ క్రియేట్ చేసాయి,. తాజాగా ఈ కాంబోకి  స్టార్ హీరోయిన్ సమంత తోడైతే ఇంకెలా ఉంటుంది.  వేరే రేంజిలో ఉంటుంది. ఇప్పుడు వీరి కాంబినేషన్ లో పుష్ప సినిమాకు అదే జరుగుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి  ఐటెం సాంగ్ లిరిక్స్ రిలీజ్ చేశారు. ఊ అంటావా మావా.. ఊ.. ఊ అంటావా మావా అంటూ మొదలయ్యే సాంగ్ ప్రేక్షకులను వీపరితంగా ఆకట్టుకుంటోంది. అయితే అదే సమయంలో ఈ పాట కాపీ అని కామెంట్స్ వినపిస్తున్నాయి.

 “ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావ’ సాంగ్ ఎక్కడో విన్నట్టుగా ఉందని  నెటిజన్లు ట్విట్టర్, ఫేస్ బుక్ లలో కామెంట్లు చేస్తున్నారు. ఈ స్పెషల్ సాంగ్ అచ్చం సూర్య హీరోగా నటించిన “వీడొక్కడే” సినిమాలోని ‘హానీ.. హానీ’ పాటలా ఉందని అంటున్నారు.యూట్యూబ్ లో వీడియోలు వదులుతున్నారు. ఓ రేంజిలో ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ దేవి కాపీ కొట్టాడంటారా లేదా అంటే రెండు పాటలు విని మీరే డిసైడ్ చేయండి.

 తెలుగులో 'ఊ అంటావా మావా ఊఊ అంటావా' అంటూ సాగే ఈ గీతాన్ని కొత్తమ్మాయి ఇంద్రావతి చౌహాన్ ఆలపించింది. 'మీ మగబుద్ధే వంకరబుద్ధి' అంటూ ఇంద్రావతి గొంతుకలో ఈ ఐటం పాట మరింత కొత్తగా ధ్వనించింది. చంద్రబోస్ ఈ పాటకి లిరిక్స్ అందించగా ఇంద్రావతి చౌహాన్ ఈ పాటను పాడారు. హస్కీ వాయిస్ తో కూడిన ఆమె వాయిస్ ప్రేక్షకులకు నిజంగా మత్తు ఎక్కిస్తుంది.

 ఇంతకీ ఈ ఇంద్రావతి చౌహాన్ ఎవరంటే సింగర్ మంగ్లీ అలియాస్ సత్యవతి చెల్లెలు.. ఇంద్రావతి కూడా మంచి ఫోక్ సింగర్.. ఇప్పటికే చాలా ఫోక్ సాంగ్స్ పాడింది. కోటి న్యాయ నిర్ణేతగా 'బోల్ బేబీ బోల్' రియాలిటీ షోలో ఆమె పాటలు పాడింది. ఇక జార్జిరెడ్డి సినిమాలో ఇంద్రావతి జాజిమోగులాలి అనే పాట పాడింది. ఆమెకి ఇప్పుడు ఏకంగా పుష్పలో ఐటెం సాంగ్ పాడే ఛాన్స్ వచ్చింది. ఈ పాట ఆమెకి ఫుల్ క్రేజ్ తెస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ, సంజనాల డ్రామాలు కళ్లకి కట్టినట్టు చూపించిన బిగ్‌ బాస్‌.. కళ్యాణ్‌ ఫస్ట్‌ ఫైనలిస్ట్
Anasuya: నేనేమీ సాధువును కాదు.. ఇలా మాట్లాడటం నాకూ వచ్చు