అల్లు అర్జున్ అసిస్టెంట్ అరెస్ట్.. జూనియర్ ఆర్టిస్ట్ ఆత్మహత్య కేసులో పుష్ప నటుడు

Published : Dec 06, 2023, 06:57 PM ISTUpdated : Dec 06, 2023, 06:58 PM IST
అల్లు అర్జున్ అసిస్టెంట్ అరెస్ట్.. జూనియర్ ఆర్టిస్ట్ ఆత్మహత్య కేసులో పుష్ప నటుడు

సారాంశం

అల్లు అర్జున్ అసిస్టెంట్.. పుష్ప నటుడు జగదీష్... అలియాస్ కేశవ్ అరెస్ట్ అయ్యారు.  జగదీష్ ను కోర్టులో హాజరుపరిచినట్టు తెలుస్తోంది. ఇంతకీ విషయం ఏంటంటే..?   

పుష్ప సినిమాలో  అల్లు అర్జున్ పక్కన సహాయ నటుడి పాత్రలో నటించిన  జగదీశ్ అలియాస్ కేశవ అరెస్ట్ అయ్యారు. ఆయనపై  పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.  జూనియర్ ఆర్టిస్టు ను వేదించిన కేసులో ఆయనపై కేసు నమోదు అయ్యింది. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన యువతి జూనియర్ ఆర్టిస్ట్ గా ఉంది. ఆమెను జగదీష్ వేందించాడన్న ఆరోపణలు ఉన్నాయి. అతని వేదింపులతో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. 

సదరు యువతి  మరో వ్యక్తితో ఉన్నప్పుడు ఫొటోలు తీసి.. వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని జగదీష్  బెదిరింపులకు పాల్పడినట్టు  జగదీశ్ పై ఆరోపణలు చేస్తున్నారు. ఇక అతన్ని పంజాగుట్ట పోలీసులు బుధవారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. జగదీశ్ వేధింపులతో పంజాగుట్ట పరిధిలో నివాసం ఉంటున్న ఓ మహిళ జూనియర్ అర్టిస్టు గత నెల 29న ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు మహిళ ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకున్నారు. 

Ram Charan పెళ్లైయ్యిందని వదిలేశాను.. లేకుంటే.. ప్రముఖ మోడల్ బోల్డ్ కామెంట్స్..

ఇక ఆ మహిళ గత నెల 27న ఓ వ్యక్తితో ఉన్న సమయంలో ఆమెకు తెలియకుండా జగదీశ్ ఫొటోలు తీశాడు. ఆ తర్వాత ఆమెను బెదిరించాడు. దీంతో మనస్తాపానికి గురైన మహిళ ఉరేసుకొని ఆత్మహ చేసుకుంది. ఈ కేసులో అప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతున్న బండారు జగదీశన్ను ఇవాళ అరెస్టు చేసి రిమాండ్ కు  తరలించారు. ఆత్మహత్య చేసుకున్న మహిళతో గతంలో జగదీశ్ కు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే  పరిచయం ఉందని పోలీసులు తెలిపారు.

ఇక పుష్ప సినిమాలో ఫుల్ లెన్త్ క్యారెక్టర్ చేశాడు జగదీష్. పుష్పరాజ్ కు అసిస్టెంట్ గా జగదీష్ వాయిస్ తోనే సినిమా అంతా నడుస్తుంది. ఈసినిమా తరువాత జగదీష్ కు అవకాశాలు పెరిగాయి. మంచి  నటుడిగా గుర్తింపు తెచ్చుకునే సమయంలో తనంతట తానే ఇలా లైఫ్ ను ఇబ్బందుల్లోకి నెట్టుకున్నాడని కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Remuneration: సౌత్‌లో అత్యధిక పారితోషికం తీసుకున్న ఒకే ఒక్కడు.. ఆయన ముందు ప్రభాస్, విజయ్‌, అల్లు అర్జున్‌ జుజూబీ
2025లో 8 జంటల సీక్రెట్ లవ్ ఎఫైర్స్ ..లిస్ట్ లో రాంచరణ్, ప్రభాస్, మహేష్ హీరోయిన్లు