కడుపునిండిన వాడి పక్కన అస్సలు ఉండొద్దు.. వేట మానొద్దుః పూరీ మ్యూజింగ్స్

By Aithagoni RajuFirst Published Oct 15, 2020, 3:56 PM IST
Highlights

మంగళవారం మంచిది కాదని ఓ కుక్కని కన్విన్స్ చేయలేమని, శ్రావణ శుక్రవారం స్నానం చేస్తే స్వర్గానికి వెళతావని ఓ కోతికి నచ్చ చెప్పలేమని, ప్రపంచంలో ఏ జంతువూ కల్పిత కథలను నమ్మదని, జంతువులు కూడా వాస్తవాలనే నమ్ముతాయని పూరీ జగన్నాథ్‌ అన్నారు.

పూరీ జగన్నాథ్‌ `పూరీ మ్యూజింగ్స్` పేరుతో తన ఆలోచనలు, అభిప్రాయాలు పంచుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా `వేట` పేరుతో మరో అభిప్రాయాన్ని పంచుకున్నారు. కడుపు నిండిన వాడి పక్కన అస్సలు ఉండొద్దని తెలిపారు. 

ఆయన మాట్లాడుతూ, మంగళవారం మంచిది కాదని ఓ కుక్కని కన్విన్స్ చేయలేమని, శ్రావణ శుక్రవారం స్నానం చేస్తే స్వర్గానికి వెళతావని ఓ కోతికి నచ్చ చెప్పలేమని, ప్రపంచంలో ఏ జంతువూ కల్పిత కథలను నమ్మదని, జంతువులు కూడా వాస్తవాలనే నమ్ముతాయన్నారు. కానీ బూడిద పూస్తే దెయ్యం రాదంటే మనం నమ్ముతాం. ఈ రాయిని లోపల పెట్టుకుంటే ప్రపంచాన్ని ఏలతావంటే నమ్ముతాం. 

మనిషి వేటగాడిగా ఉన్నప్పుడు బాగానే ఉన్నాడని, ఏడు వేల సంవత్సరాల క్రితం వ్యవసాయం ప్రారంభించాడు. వేట మానేశాడు. ఇంటి చుట్టూ పంట, చేతిలో కంచం, పని తగ్గింది. కల్పిత కథలు మొదలయ్యాయి. వాటిని వినడమేకాదు, నమ్మడం కూడా ప్రారంభించారు. అప్పుడే అన్ని దరిద్రాలూ చుట్టుకున్నాయి. తర్వాత దేవుడు పుట్టాడు. మతం పుట్టింది. నమ్మకాలు ప్రారంభమయ్యాయి. వాటి మధ్య పెరిగాం` అని తెలిపారు. 

మతం, దేవుడు రావడంతో ప్రశ్నించే తత్వం పోయిందని, మూఢవిశ్వాలపై ఆసక్తి పెరిగింది. నలుగురితో నారాయణ, గుంపుతో గోవింద అన్నట్టు బతికేస్తున్నామని, కంచంలోకి ఉచితంగా భోజనం వచ్చినన్ని రోజులూ ఇలానే ఉంటుంది. వేటగాడెప్పుడూ అప్రమత్తంగా ఉంటాడు. మీరు వేట మానొద్దు. మీ ఊళ్ళో ఉండొద్దు. కడుపు నిండిన వాడి పక్కన అస్సలు ఉండొద్దని చెప్పాడు. 

click me!