ఎన్టీఆర్‌ని అచ్ఛు గుద్దేశాడు.. రామరాజుఫర్‌భీమ్‌ స్పూఫ్‌ అదుర్స్

Published : Oct 26, 2020, 07:15 PM IST
ఎన్టీఆర్‌ని అచ్ఛు గుద్దేశాడు.. రామరాజుఫర్‌భీమ్‌ స్పూఫ్‌ అదుర్స్

సారాంశం

సినిమా అభిమానులు, హీరోల అభిమానులు స్పూఫ్‌లతో తమ ప్రతిభని చాటుకుంటున్నారు. ఆ మధ్య మహేష్‌ నటించిన `సరిలేరు నీకెవ్వరు` చిత్రంలోని ఫైట్‌ సీన్లని స్పూఫ్‌ చేసి మెప్పించారు. ఇప్పుడు ఎన్టీఆర్‌ని స్పూఫ్‌ చేశాడో కుర్రాడు. వేలూరు జోష్‌ అనే కుర్రాడు జోషి క్రియేషన్స్ పేరుతో ఈ వీడియోని రూపొందించారు. 

టాలీవుడ్‌లో స్పూఫ్‌లకు అల్లరి నరేష్‌ కేరాఫ్‌గా నిలిచేవారు. అనేక సినిమాల్లోని డైలాగ్‌లను తన సినిమాల్లో వాడేవారు. ఏకంగా స్పూఫ్‌తోనే ఓ సినిమా తీశారు. అది అన్ని సార్లు వర్కౌట్‌ కాదు. దీంతో అల్లరి నరేష్‌ ట్రెండ్‌ మార్చారు. 

ఇప్పుడు స్పూఫ్‌లతో కుర్రాళ్ళు రెచ్చిపోతున్నారు. సినిమా అభిమానులు, హీరోల అభిమానులు స్పూఫ్‌లతో తమ ప్రతిభని చాటుకుంటున్నారు. ఆ మధ్య మహేష్‌ నటించిన `సరిలేరు నీకెవ్వరు` చిత్రంలోని ఫైట్‌ సీన్లని స్పూఫ్‌ చేసి మెప్పించారు. ఇప్పుడు ఎన్టీఆర్‌ని స్పూఫ్‌ చేశాడో కుర్రాడు. వేలూరు జోష్‌ అనే కుర్రాడు జోషి క్రియేషన్స్ పేరుతో ఈ వీడియోని రూపొందించారు. 

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా, రాజమౌళి దర్శకత్వంలో `ఆర్‌ఆర్‌ఆర్‌` రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇటీవల దసరా పండుగని పురస్కరించుకుని `రామరాజుఫర్‌భీమ్‌` పేరు ఎన్టీఆర్‌ టీజర్‌ని విడుదల చేశారు. `రామరాజుఫర్‌భీమ్‌` టీజర్‌ ని అచ్ఛు గుద్దేశాడు జోషి అనే కుర్రాడు. ఎన్టీఆర్‌ స్థానంలో తాను భీమ్‌గా మారిపోయి వీఎఫ్‌ఎక్స్ షాట్స్ ఉపయోగించి మరీ టీజర్‌ని స్పూఫ్‌ చేశాడు. ఇది విశేషంగా ఆకట్టుకుంది. ఇది చూసి ఇంప్రెస్‌ అయిన `ఆర్‌ ఆర్‌ ఆర్‌` నిర్మాత డి.వి.వి దానయ్య ఈ వీడియోని ట్విట్టర్‌ ద్వారా పంచుకున్నారు. పిచ్చి(అభిమానం)కి అంతం అనేది లేదు. మీరు చంపేశారు. మీకు మంచి భవిష్యత్‌ ఉండాలని కోరారు దానయ్య. ప్రస్తుతం ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode: శివన్నారాయణతో నిజం చెప్పిన శౌర్య- పారుతో ఆడుకున్న కార్తీక్
Rajamouli Heroes: రాజమౌళి హీరోల్లో ఈ ముగ్గురు మాత్రమే భిన్నం.. వరుసగా 12 ఫ్లాపులతో కెరీర్ ఆల్మోస్ట్ పతనం