సినిమాలపై పూరీ జగన్నాథ్ కీలక నిర్ణయం.. ఇకపై అలాగే తీయబోతున్నాడంటా.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!

Published : Aug 20, 2022, 01:09 PM ISTUpdated : Aug 20, 2022, 01:11 PM IST
సినిమాలపై పూరీ జగన్నాథ్ కీలక నిర్ణయం.. ఇకపై అలాగే తీయబోతున్నాడంటా.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!

సారాంశం

స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) సినిమాలపై ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక తన సినిమాలు ఆలస్యంగానే వస్తాయంటూ కామెంట్స్ చేశాడు. ‘లైగర్’ విషయంలోనూ అదే పాటించారని తెలుస్తోంది.   

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)ను స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషనల్ లో వస్తున్న చిత్రం ‘లైగర్’. ప్రస్తుతం చిత్ర ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు తన వ్యక్తిగత విషయాలను కూడా బహిర్గతం చేస్తున్నారు. తాజాగా పూరీ జగన్నాథ్ మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అయితే ఇండస్ట్రీలో సినిమాలను స్పీడ్ గా తెరకెక్కించడంలో పెట్టింది పేరు పూరీ జగన్నాథ్ (Puri Jagannadh). అతి తక్కువ సమయంలోనే సినిమా తీసినా.. ఇండస్ట్రీ హిట్ కొట్టడం ఈయన ప్రత్యేకత. ఇదే విషయాన్ని ‘టెంపర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నూ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కూడా తెలియజేశారు. అయితే ఇకపై పూరీ జగన్నాథ్ సినిమాల విషయం ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఇకపై పూరీ జగన్నాథ్ సినిమాల విషయంలో కొత్త పంథాలో పయనించనున్నాడు. మూవీ షూటింగ్స్ లో స్పీడ్ తగ్గించనున్నట్టు తెలిపారు. అన్నీ సినిమాలను కాస్తా టైం తీసుకొనే చేస్తానని అన్నారు. మరింత అవుట్ కోసమే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.  గతంలో వరుస ఫ్లాప్స్ తో ఉన్న పూరీ ‘ఇస్మార్ట్ శంకర్’నూ అదే తరహాలో తెరకెక్కించారు. ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధంగా ఉన్న Ligerకు కూడా రెండేండ్ల సమయం పట్టింది. ఇందులో కరోనా పరిస్థితుల వల్ల ఓ ఆర్నెళ్ల సమయం పోయినా.. మిగిలిన సమయం చిత్ర పనుల్లో ఉన్నారు. ఏదేమైనా పూరీ తీసుకున్న ఈ నిర్ణయం ఇండస్ట్రీలో నయా ట్రెండ్ క్రియేట్ చేస్తుందని అభిమానులు భావిస్తున్నారు. 

రౌడీ హీరో విజయ్ దేవరకొండ - బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే జంటగా నటిస్తున్న చిత్రం ‘లైగర్’. కాగా పూరీ జగన్నాథ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తెలుగు, హిందీలో నిర్మించిన ఈ చిత్రాన్ని తమిళం, మలయాళం,  కన్నడ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఆగస్టు 25న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే చిత్రం నుంచి వచ్చిన పోస్టర్స్, పాటలు, ట్రైలర్ కు ఆడియెన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. చిత్ర యూనిట్ నిర్వహిస్తున్న ప్రమోషన్స్ తోనూ ఆడియెన్స్ రీచ్ కూడా వేరే లెవల్లో ఉంది. ధర్మ ప్రొడక్షన్స్, పూరీ కనెక్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. కరణ్ జోహార్, పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్, అపూర్వ మెహతా నిర్మాతలుగా వ్యవహరించారు.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: జీరోకి పడిపోయి జైల్లోకి వెళ్లిన సంజనా.. భరణికి బిగ్‌ బాస్‌ బంపర్‌ ఆఫర్‌
Rajasekhar: హీరో రాజశేఖర్‌కి గాయాలు, సర్జరీ.. 36ఏళ్ల తర్వాత సరిగ్గా ఇదే టైమ్‌, షాకింగ్‌