
ఒకప్పుడు సౌత్ ఇండియా నుంచి స్టార్ డైరెక్టర్ అంటే మణిరత్నం పేరు వినిపించేంది. కొత్త నీరు వస్తున్నా కొద్ది.. ఆయన కాస్త వెనకబడ్డా.. ఇప్పటికీ మణిరత్నం సినిమాలంటే క్రేజ్ మాత్రం పోలేదు. చాలా మంద ఆయనకు హార్ట్ కోర్ ఫ్యాన్స్. ఇక ఈ జనరేషన్ కు పోటీ ఇస్తూ.. భారీ బడ్జెట్ తో పొన్నియన్ సెల్వన్ టైటిల్ తో ప్యాన్ ఇండియా సినిమాను చేస్తేన్నారు మణిరత్నం. ఈమూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతోంది
దర్శకులలో మణిరత్నం స్థానం ప్రత్యేకం. ఆయన సినిమాలన్నా.. ఆయన టేకింగ్ అన్న ఇష్టపడే ఆడియనస్ తో పాటు హీరోలు కూడా చాలా మంది ఉన్నారు. చాలా మంది దర్శకులు మణిరత్నం ను స్ఫూర్తిగా తీసుకుని దర్శకత్వం వైపు వచ్చిన వాళ్లే. అలాంటి దర్శఖులు ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతోమంది ఉన్నారు. మణిరత్నం తాజా చిత్రం పొన్నియిన్ సెల్వన్ రిలీజ్ కు రెడీ అయ్యింది. . తమిళ , తెలుగుమలయాళ,కన్నడ,హిందీ భాషల్లో ఈ సినిమా మొదటి భాగం సెప్టెంబర్ 30వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు.
ఇప్పటికే ఈసినిమా నుంచి కొన్ని అప్ డేట్స్ వచ్చాయి.. మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో నిన్న హైదరాబాద్ వేదికగా ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేశారు. ఈ ఈ సందర్భంగా డైరెక్టర్ మణిరత్నం మాట్లాడుతూ .. ముందుగా రాజమౌళి గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈ జనరేషన్ లో కూడా జానపదాలను చేసి సక్సెస్ ను సాధించవచ్చనే విషయాన్ని ఆయన నిరూపించారు. ఆయన డైరెక్ట్ చేసిన బాహుబలి లాగానే ఈ పొన్నియన్ సెల్వన్ మూవీ కూడా ఈ సినిమా రెండు భాగాలుగా వస్తుంది అని అన్నారు.
ఇక ఇదే వేదిక నుంచి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిగారికి కూడా థ్యాంక్స్ చెబుతున్నాను అన్నారు మణిరత్నం. కాని ఆయనకి ఎందుకు థ్యాంక్స్ చెప్పాననేది ఆ తరువాత మీకు తెలుస్తుంది అన్నారు. ఇక ఈసినిమా గురించి కూడా కొన్ని విషయాలు మాట్లాడారు మణిరత్నం.. రాజ రాజ చోళ కి సంబంధించిన కథతో ఈ సినిమా రూపొందింది.. తెలుగు ఆడయిన్స్ ఈ సినిమాను ఆదరిస్తారని ఆశిస్తున్నాను అన్నారు. ఇక ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో, విక్రమ్, కార్తి, జయంరవి, శరత్ కుమార్, ఐశ్వర్యా రాయ్, త్రిషల లాంటి స్టార్ కాస్ట్ నటించారు.