సినిమాలు ఏమీ భాక్సాఫీస్ దగ్గర వర్కవుట్ కావటం లేదు. దాంతో విభిన్నమైన గెటప్ లు, లుక్ లు ప్రాధాన్యత గల పాత్రలు ఎంపికి చేసుకుంటన్నట్లు తెలుస్తోంది.
బాలయ్య కెరీర్ లో బెస్ట్ మూవీగా నిలిచి కలెక్షన్స్ కొల్లగొట్టిన చిత్రం అఖండ. ఈ సినిమాలో బాలయ్య చేసిన అఘోరా పాత్రకు ఓ రేంజిలో రెస్పాన్స్ వచ్చింది. 'శంభో.. శివ శంభో.. హర హర స్వయంభో.. భం అఖండా..' అంటూ బాలయ్య సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్కు అభిమానులు శివాలెత్తిపోయారనేది నిజం. ఆ రేంజి ఇంపాక్ట్ క్రియేట్ చేశారు బాలయ్య.. అఘోరా గెటప్‌లో. అయితే ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ సైతం అఘోరగా అలరించటానికి రెడీ అవుతున్నట్లు సమాచారం.
గత కొంతకాలంగా బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్న సినిమాలు ఏమీ భాక్సాఫీస్ దగ్గర వర్కవుట్ కావటం లేదు. దాంతో విభిన్నమైన గెటప్ లు, లుక్ లు ప్రాధాన్యత గల పాత్రలు ఎంపికి చేసుకుంటన్నట్లు తెలుస్తోంది. అలాగే తనకు హిందీ డబ్బింగ్ మార్కెట్ ఉంది కాబట్టి దానికి తగినట్లు కూడా ప్రిపేర్ అవుతున్నారు. ఫైట్స్,యాక్షన్ ప్రాధాన్యత ఉన్న కథలు ఎంచుకుంటున్నారు. అలాగే హిందీలో అఖండ సెన్సేషన్ క్రియేట్ చేసింది. అలాంటి అఘోర గెటప్ తో తను కూడా హిందీ మార్కెట్ ని దున్నేయాలనే ఆలోచనలో ఉన్నట్లు చెప్పుకుంటున్నారు.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన 12వ సినిమాతో లుధీర్ అనే కొత్త దర్శకుడిని ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారని తెలుస్తోంది. స్క్రిప్ట్ నచ్చడంతో గత రెండేళ్లుగా టీమ్‌తో కలిసి ప్రయాణం చేస్తున్న యంగ్ హీరో.. ఈ ఏడాదే ఈ సినిమాని పట్టాలెక్కించాలని భావిస్తున్నారట. ఇది బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తెరకెక్కే సినిమా కానుంది. చందు మహేష్, సాయి శశాంక్ దీనికి నిర్మాతలు. ఈ చిత్రానికి ''హైందవ'' అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారట. సినీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ మూవీలో శ్రీనివాస్ ఒక అఘోరా పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది.
ఇక ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ ... 'టైసన్ నాయుడు' అనే సినిమా చేస్తున్నారు. ఇదొక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్. 'భీమ్లా నాయక్' ఫేమ్ సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఇది షూటింగ్ దశలో ఉండగానే ఇటీవలే తన తదుపరి చిత్రాన్ని ప్రారంభించాడు. 'చావు కబురు చల్లగా' ఫేమ్ కౌశిక్ పెగళ్ళపాటి 'BSS 11' సినిమాకి దర్శకుడు.