అఫీషియల్: 'జనగణమన ' ప్రకటించిన పూరి జగన్నాధ్.. మహేష్ కోసం రాసుకున్న కథ...

Sreeharsha Gopagani   | Asianet News
Published : Feb 07, 2022, 06:46 AM IST
అఫీషియల్: 'జనగణమన ' ప్రకటించిన పూరి జగన్నాధ్.. మహేష్ కోసం రాసుకున్న కథ...

సారాంశం

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కు టాలీవుడ్ లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. నిర్మాతల ఫ్రెండ్లీ డైరెక్టర్ పూరి జగన్నాధ్. బడ్జెట్ హద్దులు దాటకుండా తక్కువ టైంలో మంచి అవుట్ పుట్ తో పూరి సినిమాలు చేస్తుంటారు.

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కు టాలీవుడ్ లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. నిర్మాతల ఫ్రెండ్లీ డైరెక్టర్ పూరి జగన్నాధ్. బడ్జెట్ హద్దులు దాటకుండా తక్కువ టైంలో మంచి అవుట్ పుట్ తో పూరి సినిమాలు చేస్తుంటారు. భారీ కథలపై ఎక్కువగా ఆధారపడకుండా పూరి జగన్నాధ్ తన టేకింగ్ నే నమ్ముకుంటారు. యువత మెచ్చే కమర్షియల్ అంశాలు పూరి చిత్రాల్లో పక్కాగా ఉంటాయి. 

ప్రస్తుతం Puri Jagannadh రౌడీ హీరో విజయ్ దేవరకొండతో 'లైగర్' చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ఆదివారం ముగిసింది. ఈ విషయాన్ని స్వయంగా పూరి జగన్నాధ్ ప్రకటించారు. ఇక పూరి తదుపరి చిత్రం ఏంటనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. 

ఎందుకంటే పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ 'జనగణమన' గురించి చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. లైగర్ తర్వాత జనగణమన ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. ఆ వార్తలని నిజం చేస్తూ పూరి జగన్నాధ్ 'జనగణమన' చిత్రాన్ని ప్రకటించారు.పూరి వాయిస్ మెసేజ్ ని చార్మి ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. 

'లైగర్ షూటింగ్ ముగిసింది. ఇక ఈ రోజు నుంచి 'జనగణమన' అంటూ పూరి జగన్నాధ్ ప్రకటించారు. ఈ చిత్రంలో కూడా విజయ్ దేవరకొండనే హీరోగా నటిస్తున్నాడు. ఇది పూరి జగన్నాధ్ కోసం రాసుకున్న కథ. మహేష్ బాబు హీరోగా పూరి ఈ చిత్రాన్ని ప్రకటించారు కూడా. కానీ అనుకోకుండా ఈ చిత్రం అటకెక్కింది. మహేష్ ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో ఆ కథకు సరిపడే హీరో కోసం పూరి వెతుకుతున్నారు. లైగర్ లో విజయ్ దేవరకొండ పెర్ఫామెన్స్ కు ఫిదా అయిన పూరి అతడినే జనగణమనలో హీరోగా ఎంపిక చేసుకున్నాడు. ఈ చిత్రానికి కూడా చార్మి ఒక నిర్మాతగా వ్యవహరించనుంది.    

 

PREV
click me!

Recommended Stories

చిరంజీవి, అనిల్ రావిపూడి రెమ్యునరేషన్స్ కే బడ్జెట్ మొత్తం అయిపోయిందా ? ఇక సినిమా పరిస్థితి ఏంటి ?
Illu Illalu Pillalu Today Episode Dec 17: వల్లిని గట్టిగా నిలదీసిన రామరాజు, దొంగ సర్టిఫికెట్లతో భాగ్యం