
తెలుగు సినీ పరిశ్రమలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న దర్శకుడు పూరీ జగన్నాథ్. సినీ పరిశ్రమలో తన కంటూ సెపరేట్ మార్క్ క్రియేట్ చేసుకుని పూరి మార్క్ అంటూ ఓ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న ఈ డైలాగ్ బ్లాస్టర్ కు హీరోల మాదిరిగానే సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా విపరీతంగానే ఉంది. దర్శకులకు ఫాలోయింగ్ ఉంటుంది అన్నది అసలు పూరీతోనే మొదలైందని చెప్పాలి. హిట్స్, ఫ్లాపులతో సంబంధం లేకుండా తతన కెరీర్ లో ది బెస్ట్ అనిపించుకునేలా సినిమాలు తీస్తూ అప్పుడప్పుడు కాస్త అటు ఇటు అయినా... పూరీ మార్క్ బ్రాండ్ తో తన పని తాను చేసుకు పోతున్నాడు. ఇటీవల డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొన్న పూరీ ఇవాళ 51వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు.
సెప్టెంబర్ 28 1966 లో జన్మించిన పూరీ 2000 సంవత్సరంలో ఫస్ట్ టైం మెగా ఫోన్ పట్టిన పూరి మొదటి సినిమానే పవర్ స్టార్ పవన్‌కళ్యాణ్ తో తీయడమే కాకుండా పవర్ స్టార్ కు బద్రీ రూపంలో భారీ విజయాన్ని అందించాడు.. కాని ఆ సక్సెస్‌ను బాచీ సినిమాతో కంటిన్యూ చేయలేక పోయాడు. ఆ తరువాత మళ్లీ రవితేజ హీరోగా ఇట్లు శ్రావణీ సుబ్రమణ్యం లాంటి లవ్ స్టోరీతో ట్రాక్ లోకి వచ్చాడు.
అయితే...పూరీ కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమా మాత్రం ఇడియట్ అనే చెప్పాలి ..రవితేజ్కు కూడా మాస్ ఇమేజ్ ను తెచ్చిన హీరో క్యారక్టరైజేషన్ అంటే ఇలా ఉండాలి హీరో అంటే ఇలానే ఉండాలి అంటూ పూరీ మార్క్ అంటే ఏంటో చూపించాడు..ఆ సినిమాను ఇన్స్ పిరేషన్ గా తీసుకుని ఎందరో ఆయన్ను ఫాలో అయ్యారు కాని.. పూరీ తో పోటీ పడలేక పోయారు. 7 రోజుల్లో కథరాసి డైలాగ్ వర్షన్ 8 రోజుల్లో టోటల్ 15 రోజుల్లో కంప్లిట్ స్క్రిప్ట్ ను రాయగల ఏకైక దర్శకుడు పూరీ జగన్నాథ్..ఇడియట్ తరువాత అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి,శివమణి లాంటి బ్లాక్‌బాస్టర్ హిట్లు కొట్టి టాప్ డైరెక్టర్ అయ్యారు పూరీ.
ఆ తరువాత కొన్ని ఫ్లాపులు పడ్డా...పోకిరి సినిమాతో ఇండస్ట్రిని ఒక ఊపు ఊపేశాడు ...ఇండస్ట్రీ రికార్డ్ అంటే ఎలా ఉంటుందో అన్న అనుమానాలకు పోకిరి సమాధానంగా నిలిచింది..అల్లు అర్జున్‌తో దేశముదురు లాంటి భారీ విజయం అందుకున్న ఈ డాషింగ్ డైరెక్టర్ ...ఆ తరువాత చిరంజీవి తనయుడిని చిరుత సినిమాతో ఇంట్రడ్యూస్ చేశాడు పూరీ..ఆ తరువాత ప్రభాస్‌తో బుజ్జిగాడు, ఏక్ నిరంజన్ లాంటి సినిమాలతో పాటు రవితేజ్‌తో నేనింతే సినిమా తీసి నందీ అవార్డు సైతం అందుకున్నాడు.
మహేష్ తో బిజినెస్ మ్యాన్ లాంటి సినిమాలు తియ్యాలన్నా, పవన్ కళ్యాణ్ తో కెమెరామెన్ గంగతో రాంబాబు లాంటి సినిమాలు తియ్యాలన్నా...తారక్ లాంటి యాక్టింగ్ పవర్ ఉన్న హీరోలతో టెంపర్ లాంటి సినిమాలు తీయాలన్నా అది కేవలం పూరీ కే సాధ్యం.
ఇప్పటికే 32 సినిమాలకు దర్శకత్వం వహించిన పూరి ప్రస్తుతం తన కొడుకు ఆకాష్ పూరీతో సినిమా చేస్తున్నాడు..దీని ముందు చేసిన పైసావసూల్ హిట్ అవ్వకున్న ...వరుసగా ఫ్లాపులు ఎదురవుతున్నా పూరీ క్రేజ్ మాత్రం ఎప్పటికి తగ్గదనే చెప్పాలి
సినిమా పరంగా కాని...పర్సనల్ లైఫ్‌లో అయినా కాని ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్న డౌన్ ఫాల్స్ వచ్చినా మళ్లీ కమ్‌బ్యాక్ అవ్వడం గ్రాండ్ వేలో ఇండస్ట్రీకి పూరీ మార్క్ ను చూపడం జగన్‌కు వెన్నతో పెట్టిన విద్య ...నేడు పుట్టిన రోజు సందర్భంగా పూరీ జగన్నాధ్ కి 'ఆసియానెట్' జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది.