అప్పు కొత్త సినిమా ట్రైలర్ విడుదల.. స్పందించిన ప్రధాని మోదీ.. ఏమన్నాడంటే?

Published : Oct 09, 2022, 06:56 PM IST
అప్పు కొత్త సినిమా ట్రైలర్ విడుదల.. స్పందించిన ప్రధాని మోదీ.. ఏమన్నాడంటే?

సారాంశం

దివంగత, కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ (Puneeth Rajkumar) వెండితెరపై చివరిగా  కనిపంచబోతున్న చిత్రం ‘గాంధడ గుడి’. ఈ చిత్రం టీజర్ తాజాగా రిలీజ్ కాగా.. ప్రధాని నరేంద్ర మోడీ ఆసక్తికరంగా స్పందించారు.   

సినీ నటుడిగానే కాకుండా.. లక్షలాది కన్నడ ప్రజల గుండెల్లో మంచి మనస్సున వ్యక్తిగా చోటుసంపాదించుకున్నాడు దివంగత, కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ (Puneeth Rajkumar). కానీ కాలం ఆడిన ఆటలో తక్కువ వయస్సులోనే గతేడాది అక్టోబర్ 29న గుండెపోటుతో మరణించారు. ఆయన మరణవార్తను అభిమానులు, సినీ ప్రముఖులు, కుటుంబీకులు ఇప్పుడిప్పుడే జీర్ణించుకుంటున్నారు. భౌతికంగా అప్పు మన మధ్యలో లేకపోయినా.. సినిమాల ద్వారా ప్రేక్షకుల హృదయాల్లో జీవించే ఉంటాడని అభిమానులు మనోధైర్యం పెంచుకుంటున్నారు. 

అయితే, అప్పు నటించిన చివరి చిత్రం  ‘గాంధడ గుడి’ (Gandhada Gudi) రిలీజ్ కు సిద్ధంగా ఉంది.  పునీత్ రాజ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించారు. అమోఘవర్ష జేఎస్ దర్శకత్వం  వహించారు. ఈ నెలలోనే ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ మూవీ నుంచి ట్రైలర్ ను విడుదల చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. ప్రస్తతు ఇంటర్నెట్ లో వ్యూస్ తో దూసుకుపోతోంది. ఈ సందర్భంగా చిత్ర టీజర్ పై ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) కూడా ఆసక్తికరంగా స్పందించారు. 

సినిమా ట్రైలర్‌ పై నరేంద్ర మోదీ ట్వీట్ చేస్తూ..  'గంధాడ గుడి' టీమ్‌కి శుభాకాంక్షలు తెలిపారు. అప్పు మన మధ్య భౌతికంగా లేకపోయినా మిలియన్ల అభిమానులు, ప్రేక్షకుల హృదయాల్లో బతికే ఉన్నారన్నారు. పునీత్ రాజ్ కుమార్ గొప్ప వ్యక్తితం గల  మనిషిగా కొనియాడారు. గంధడగుడి  సినిమాకు, కర్ణాటక నేచర్ సౌందర్యానికి, పర్యావరణ పరిరక్షణకు నా నివాళి’ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్విట్ నెట్టింట వైరల్ గా మారింది. అయితే పునీత్ రాజ్ కుమార్ సతీమణి అశ్విని పునీత్ రాజ్ కుమార్ ‘గాంధడ గుడి’ ట్రైలర్ రిలీజ్ కాగానే ప్రధానికి ట్యాగ్ చేస్తూ షేర్ చేసింది. ఇందుకు వెంటనే ప్రధాని  స్పందించడంతో పునీత్ అభిమానులు, కన్నడ ప్రేక్షకులు ఖుషీ అవుతున్నారు.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Pawan Kalyan తో నటించి కనిపించకుండా పోయిన హీరోయిన్లు, లిస్ట్ లో ఐదుగురు.. ఆమె మాత్రం చేజేతులా..
10 భాషల్లో 90 సినిమాలు.. 50 ఏళ్ల పెళ్లి కాని బ్యాచిలర్ హీరోయిన్ ఎవరో తెలుసా ?