బిగ్ బాస్ 3: బాయ్ ఫ్రెండ్ చనిపోయాడని కంటతడి పెట్టుకున్న పునర్నవి

Published : Aug 03, 2019, 02:16 PM IST
బిగ్ బాస్ 3: బాయ్ ఫ్రెండ్ చనిపోయాడని కంటతడి పెట్టుకున్న పునర్నవి

సారాంశం

బిగ్ బాస్ హౌస్‌లో గ్లామర్ బ్యూటీగా అడుగుపెట్టిన పునర్నవి భూపాలం.. తన లైఫ్‌లో జరిగిన భావోద్వేగ సంఘటనను షేర్ చేసుకుని ఇంటి సభ్యుల్ని ఎమోషన్‌కి గురిచేశారు. పాపా.. పాపా అంటూ తన వెంటపడి తనను ఎంతో బాగా చూసుకున్న తన రామ్‌ని కోల్పోయా అంటూ బాధపడింది.  

బిగ్ బాస్ మూడో సీజన్ లో కంటెస్టంట్ గా పాల్గొన్న పునర్నవి నిన్న జరిగిన ఓ టాస్క్ లో ఎమోషనల్ అయింది. తన లైఫ్ లో జరిగిన విషయాలను చెబుతూ కంటతడి పెట్టుకుంది. పునర్నవి ఓ వ్యక్తిని ప్రేమించిందట. అదే తన మొదటి రిలేషన్షిప్. అయితే అతడు బాగా కొట్టేవాడని.. దీంతో ఆ రిలేషన్షిప్ నుండి బయటకి వచ్చేశానని.. ఆ టైంలో డిప్రెషన్ లోకి 
వెళ్లిపోయినట్లు.. తన తల్లి ఇంట్లోనే ఉన్నా మాటలు ఉండేవి కాదని చెప్పుకొచ్చింది.

అలాంటి సమయంలో తనకు రామ్ అనే వ్యక్తి పరిచయమయ్యాడని.. తనను చాలా బాగా చూసుకునేవాడని చెప్పింది. అయితే ఓ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరగడంతో విడిపోయినట్లు తెలిపింది.

ఆ తరువాత రామ్ ఎంతగా మాట్లాడడానికి ప్రయత్నించినా.. తన మొండితనం, కోపం కారణంగా పట్టించుకోలేదని.. తనను పాపా అని పిలిచేవాడని.. తనకోసం ఎన్నిసార్లు వచ్చినా తిరిగి కూడా చూడలేదని చెప్పింది. కానీ ఏప్రిల్ లో అతడు చనిపోయినట్లు మెసేజ్ వచ్చిందని చెప్పి ఎమోషనల్ అయింది.

ఈస్టర్ కి తన స్నేహితులతో కలిసి శ్రీలంక వెళ్లిన రామ్ కొలంబోలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ లో చనిపోయాడని.. చెబుతూ కంటతడి పెట్టుకుంది. కేవలం తన కోపం, మొండితనం వలనే అతడితో సరిగ్గా ఉండలేకపోయానని.. అతని చావుతో చాలా నేర్చుకున్నట్లు చెప్పింది. 
 

PREV
click me!

Recommended Stories

Rajinikanth Retirement .. 3 సినిమాల తర్వాత సూపర్ స్టార్ రిటైర్మెంట్ ప్రకటించనున్నారా?
Bigg Boss Telugu 9: లేటెస్ట్ ఓటింగ్‌లో ఊహించని ట్విస్ట్.. డేంజర్‌ జోన్‌లోకి టాప్‌ కంటెస్టెంట్లు