భవదీయుడు భగత్ సింగ్ ఫస్ట్ లుక్: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పవన్ ఫ్యాన్స్!

Published : Sep 09, 2021, 10:37 AM IST
భవదీయుడు భగత్ సింగ్ ఫస్ట్ లుక్: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పవన్ ఫ్యాన్స్!

సారాంశం

భవదీయుడు భగత్ సింగ్ అంటూ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ విడుదలచేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇండియా గేట్ వద్ద హార్లీ డేవిడ్ సన్ బైక్ పై టీ తాగుతూ కూర్చున్న పవన్ లుక్ అల్ట్రా స్టైలిష్ గా ఉంది.   


పవన్ కళ్యాణ్- హరీష్ శంకర్ కాంబినేషన్ కోసం ఫ్యాన్స్ ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు.2012లో విడుదలైన గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ రిపీట్ కావాలని కోరుకుంటున్నారు.  అలా మొత్తానికి పవర్ స్టార్ అభిమానుల కోరిక నెరవేరింది. పవన్ కళ్యాణ్ సినిమాలకు బ్రేక్ ప్రకటించడంతో ఇక ఈ కాంబినేషన్ మరలా రిపీట్ అయ్యే అవకాశం లేదని అందరూ భావించారు.అయితే 2019లో పవన్ కళ్యాణ్ తన కమ్ బ్యాక్ ప్రకటించారు. వరుస చిత్రాలు పవన్ ఓకే చేయగా, వాటిలో హరీష్ శంకర్ మూవీ కూడా ఒకటి. 
 

మైత్రీ మూవీస్ నిర్మాతలుగా పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ నేడు విడుదల చేశారు.  భవదీయుడు భగత్ సింగ్ అంటూ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ విడుదలచేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇండియా గేట్ వద్ద హార్లీ డేవిడ్ సన్ బైక్ పై టీ తాగుతూ కూర్చున్న పవన్ లుక్ అల్ట్రా స్టైలిష్ గా ఉంది. 


గబ్బర్ సింగ్ సెంటిమెంట్ కలిసొచ్చేలా, పవన్ ఫేవరేట్ దేశభక్తుడు భగత్ సింగ్ పేరు స్పృశించేలా టైటిల్ ఉంది. ఈసారి కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, అని పోస్టర్ లో చెప్పడంతో, సామాజిక అంశంలో కూడిన ఓ కమర్షియల్ సబ్జెక్టు పవన్ కోసం హరీష్ సిద్ధం చేశారని తెలుస్తుంది. భవదీయుడు భగత్ సింగ్ చిత్రానికి దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: కళ్యాణ్ ని తనూజ నిజంగా లవ్ చేస్తోందా ? సంతోషం పట్టలేక మ్యాటర్ బయటపెట్టేసిందిగా
భార్యతో విడాకుల రూమర్స్ ? స్టార్ డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్ వైరల్