కొండపై రాజకీయాలొద్దు.. రాజేంద్ర ప్రసాద్ కు పృథ్వీ కౌంటర్

By Prashanth MFirst Published Aug 16, 2019, 11:43 AM IST
Highlights

 సినీ నటుడు, ఎస్వీబీసీ చైర్మన్‌ పృథ్వీ, యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గురించి ఊహించని విధంగా కామెంట్స్ చేశారు. ఇటీవల తిరుమల కొండకు వచ్చిన రాజేంద్రప్రసాద్ రాజకీయాల గురించి స్పందించిన సంగతి తెలిసిందే.

సినీ నటుడు, ఎస్వీబీసీ చైర్మన్‌ పృథ్వీ, యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గురించి ఊహించని విధంగా కామెంట్స్ చేశారు. ఇటీవల తిరుమల కొండకు వచ్చిన రాజేంద్రప్రసాద్ రాజకీయాల గురించి స్పందించిన సంగతి తెలిసిందే. జగన్ సీఎం అయితే కలవాలా? సినిమావాళ్లు ఏమైనా వ్యాపారస్తులా అని ఆయన చేసిన కామెంట్స్ కు పృథ్వీ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. 

టీటీడీ అనుబంధ సంస్థ ఎస్వీబీసీ చైర్మన్‌ గా కొనసాగుతున్న పృథ్వీ ఆ బాధ్యత దక్కడం తన పూర్వ జన్మ సుకృతం అని చెప్పారు. అలాగే కొండపై ఉన్నప్పుడు ఎవరైనా సరే రాజకీయాలు మాట్లాడకూడదని ఇటీవల రాజేంద్ర ప్రసాద్ రాజకీయాల గురించి ఆ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదని అన్నారు. శ్రీవారికి కోట్లాది మంది భక్తులు ఉన్నారు. అందులో నేను ఒకడిని. ఒక బాధ్యత తీసుకొని కొండ మెట్లు ఎక్కినప్పుడే రాజకీయాలు మాట్లాడనని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. 

గతంలో చంద్రబాబును కలిసినప్పుడు సినీ పరిశ్రమకు ఏమి గుర్తురాలేదా? అని ప్రశ్నిస్తూ.. సీఎం జగన్ పై అనవసర వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదని అన్నారు. అలాగే చంద్రబాబు 30 ఏళ్ల పాలనలో చేయలేని అభివృద్ధి 30రోజుల్లో జగన్ చేశారని అన్నారు. ఇక వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్థాపించిన ఎస్వీబిసి టీడీపీ హయాంలో పలు అవినతి జరిగిందని విజిలెన్స్ అధికారులు చట్ట ప్రకారం విచారణ జరుపుతున్నట్లు చెప్పారు.    

click me!