ప్రముఖ నటి విద్యా సిన్హా కన్నుమూత!

Published : Aug 16, 2019, 10:50 AM IST
ప్రముఖ నటి విద్యా సిన్హా కన్నుమూత!

సారాంశం

గుండె, ఊపిరితిత్తుల సమస్యలతో గత కొంతకాలంగా ఇబ్బంది పడుతున్న ప్రముఖ సినీ నటి విద్యా సిన్హా(71) ముంబైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో తుదిశ్వాస విడిచారు. 

ప్రముఖ సినీ నటి విద్యా సిన్హా(71) కన్నుమూశారు. గుండె, ఊపిరితిత్తుల సమస్యలతో గత కొంతకాలంగా ఇబ్బంది పడుతున్న ఆమె ముంబైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో తుదిశ్వాస విడిచారు.

1947, నవంబర్ 15న పుట్టిన ఆమె తన 18వ ఏట మోడల్ గా కెరీర్ ని మొదలుపెట్టింది. ఆమె నటించిన తొలిచిత్రం 'రాజా కాక'. కిరణ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా విద్యాకు మంచి పేరు తీసుకొచ్చింది.

'రజనీగంధ' ఆమె కెరీర్ లో మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తరువాత పలు హిట్ చిత్రాల్లో నటించిన ఆమె 1986లో సినిమాలకు దూరమయ్యి ఆస్ట్రేలియాకు వెళ్లింది. ఆమె నటించిన చివరి సినిమా 'బాడీగార్డ్'. ఇందులో సల్మాన్ హీరోగా నటించారు.  

PREV
click me!

Recommended Stories

NBK 111 Glimpse: పవన్ కళ్యాణ్ ను బాలకృష్ణ ఫాలో అవుతున్నాడా? OG ని గుర్తు చేస్తున్న బాలయ్య కొత్త సినిమా ఫస్ట్ గ్లింప్స్
Rajinikanth: రజినీకాంత్‌ను బిచ్చగాడనుకొని 10 రూపాయలు వేసిన మహిళ.. రజినీ రియాక్షన్ ఇదే