బాలయ్య వరుసగా 5 ప్రాజెక్టులు, వివరాలివి..

By Surya PrakashFirst Published Jul 11, 2021, 1:07 PM IST
Highlights

వరసపెట్టి బాలయ్య ఐదు ప్రాజెక్టులలో ఉన్నారు. అఖండ సినిమా దాదాపు పూర్తైంది. ఇంక మిగతా నాలుగు సినిమాలపైనే బాలయ్య దృష్టి అంతా అని తెలుస్తోంది.

నందమూరి బాలకృష్ణ ..యంగ్ హీరోలకు పోటి ఇచ్చే విధంగా తన ప్రాజెక్టుల లైనప్ పెట్టారు. ప్రస్తుతం యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. అలాగే అనిల్ రావిపూడి దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు.

అయితే తాజాగా డైలాగ్ రైటర్ ఎమ్ రత్నం బాలకృష్ణ కోసం ఓ అద్భుతమైన కథను సిద్ధం చేశారట. ఇప్పటికే ఆ కథను బాలయ్యకు కూడా వినిపించినట్లు తెలుస్తోంది. బాలయ్య కూడా ఓకే చెప్పారట. యాక్షన్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమాకు శ్రీవాస్ దర్శకత్వం వహించబోతున్నాడట. దీనికి ముందు బాలకృష్ణ, శ్రీవాస్ కాంబినేషన్ లో డిక్టేటర్ అనే సినిమా వచ్చింది. కానీ ఈ సినిమా అనుకున్ననంతగా విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే మరోసారి ఈ కాంబినేషన్ రీపీట్ అయితే మాత్రం హిట్టవ్వడం ఖాయమని అంటున్నారు బాలయ్య అభిమానులు.
 
అలాగే అదే సమయంలో పూరి జగన్నాథ్ తో కూడా బాలయ్య ఓ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ఆ సినిమా సోషియో ఫాంటసీ అని చెప్తున్నారు. ఆ సినిమాలో బాలయ్య ప్రత్యేకమైన గెటప్ తో దుమ్ము రేపుతాడు అంటున్నారు.  ఇలా వరసపెట్టి బాలయ్య ఐదు ప్రాజెక్టులలో ఉన్నారు. అఖండ సినిమా దాదాపు పూర్తైంది. ఇంక మిగతా నాలుగు సినిమాలపైనే బాలయ్య దృష్టి అంతా అని తెలుస్తోంది.

ఇక బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది బాలకృష్ణకి 106 వ చిత్రం కావడం విశేషం. ఈ సినిమాని ద్వారక క్రియేషన్స్ పైన మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్త్హున్నాడు. కరోనా వలన వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ తాజాగా మొదలైంది. సింహ, లెజెండ్ సినిమాల తర్వాత బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ నుంచి వస్తున్న మూడో చిత్రం కావడంతో సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి. 

click me!