ఆఫ్‌ నాలెజ్డ్‌ ఉన్న తండ్రీకొడుకులు డబ్బు సంపాదించేందుకు పాట్లు.. `సౌండ్‌ పార్టీ`లో నవ్వులే నవ్వులు

Published : Nov 21, 2023, 11:33 PM ISTUpdated : Nov 21, 2023, 11:35 PM IST
ఆఫ్‌ నాలెజ్డ్‌ ఉన్న తండ్రీకొడుకులు డబ్బు సంపాదించేందుకు పాట్లు.. `సౌండ్‌ పార్టీ`లో నవ్వులే నవ్వులు

సారాంశం

తండ్రీ కొడుకులు హాఫ్‌ మైండ్‌ గాళ్లు అయితే, ఆ ఇద్దరు డబ్బు సంపాధించాలనుకుంటే, ఎలాంటి పనులు చేశారు? ఎలాంటి ఇబ్బందులు పడ్డారనే ఆసక్తికర కథాంశంతో `సౌండ్‌ పార్టీ` వస్తుందట.

బిగ్‌ బాస్‌ విన్నర్‌ వీజే సన్నీ ప్రస్తుతం `సౌండ్‌ పార్టీ` అనే చిత్రంతో వస్తున్నారు. ఆయన గత చిత్రాలు ఆశించిన స్థాయిలో సక్సెస్‌ కాలేని పరిస్థితుల్లో ఆశలన్నీ ఈ మూవీపైనే పెట్టుకున్నారు. సంజయ్‌ శౌరి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీకి జయ శంకర్‌ సమర్పకులుగా వ్యవహరించగా, సన్నీ సరసన హ్రితిక శ్రీనివాస్‌ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా ఈ నెల 24న విడుదల కాబోతుంది. సినిమా గురించి నిర్మాతలు మాట్లాడారు. రవిపొలిశెట్టి, మహేంద్రసినిమా గురించి చెబుతూ, ఆసక్తికర విషయాలను వెల్లడించారు. 

ఇటీవల కాలంలో ఫుల్‌ ఫన్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ రాలేదట. క్లీన్‌ఫ్యామిలీ కామెడీ ఎంటర్‌టైనర్‌ చిత్రాలు వచ్చి చాలా రోజులవుతుందని, ఇలాంటి మూవీస్ కి హాలీవుడ్‌లోనూ(అమెరికాలో) మంచి ఆదరణ ఉంది. అక్కడ ఇలాంటి మూవీస్‌ని బాగా చూస్తారు. కానీ ఈ మధ్య అలాంటి సినిమాలు రావడంలో లేదు. దీంతో తాము ఈ మూవీని నిర్మించినట్టు చెప్పారు. నిర్మాతలు చెబుతూ, "మేం తెలంగాణలో పుట్టి పెరిగాం. అమెరికాలో  బిజినెస్ చేస్తూ ఫ్రెండ్స్ అయ్యాం. సినిమాలపై ఉన్న ప్యాషన్ తో ప్రొడ్యూసర్స్  గా మారాలనుకున్నాం. పార్ట్ నర్ షిప్ తో ఈ సినిమాని నిర్మించాం. దాదాపు 25 స్క్రిప్టులు విన్న తర్వాత ఈ కథను ఫైనల్ చేశాం. 

యు ఎస్ ప్రేక్షకులైనా.. ఇక్కడి ఆడియన్స్ అయినా కామెడీ జానర్ సినిమాలోనే ఎక్కువగా ఇష్టపడతారు. సంజయ్ శేరి చెప్పిన స్టోరీలో ఇన్నోసెంట్ కామెడీ ఉంది.  ఫిబ్రవరిలో యుఎస్ నుంచి వచ్చి పర్ఫెక్ట్ ప్లానింగ్ తో 28 రోజుల్లో షూటింగ్ పూర్తి చేశాం. కాకపోతే అనుకున్న బడ్జెట్ కంటే కాస్త పెరిగింది. పోస్ట్ ప్రొడక్షన్ విషయంలో ఇబ్బంది పడినా వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వచ్చాం. అవుట్ పుట్ చాలా బాగా వచ్చింది. ప్రెజెంటర్ గా ఉన్న జయశంకర్ మాకు చాలా సపోర్ట్ చేశారు. కంప్లీట్ ఫ్యామిలీ అంతా చూసేలా సినిమా ఉంటుంది. సినిమాలో కామెడీ ఉంటే అమెరికా ప్రేక్షకులు బ్లాక్ బస్టర్ చేస్తారు. ఇక్కడ 100 థియేటర్లో విడుదల చేస్తుంటే యూఎస్ లో మాత్రం 150 ప్లస్ థియేటర్స్ లో విడుదల చేస్తున్నాం. 

Read more: సుడిగాలి సుధీర్‌ని వెంటాడుతున్న రాంగ్‌ కాల్స్.. ఉత్కంఠభరితంగా `కాలింగ్‌ సహస్త్ర` ట్రైలర్‌..

కుటుంబంలో తండ్రి కొడుకులు ఇద్దరూ ఇన్నోసెంట్ అయితే మనీ మేకింగ్ ఎలా చేస్తారు అనేది ఈ సినిమా కాన్సెప్ట్. ఫాస్ట్ గా రిచ్ అయిపోవడానికి వాళ్ళిద్దరూ ఏం చేశారనేది హిలేరియస్ గా ఉంటుంది. బిట్ కాయిన్ కాన్సెప్ట్ తోనూ దీంట్లో ఫన్ జనరేట్ చేసాం.  సన్నీ, శివన్నారాయణ మధ్య వచ్చే సీన్స్ ప్రేక్షకులకు నవ్వులు తెప్పిస్తాయి. సన్నీ చాలా బాగా పర్ఫార్మ్ చేశాడు. నవంబర్ 24న కాంపిటీషన్ ఉన్నా.. కథపై నమ్మకంతోనే ముందుకెళ్తున్నాం. ఫైనల్ అవుట్ పుట్ చూశాక సినిమాపై మరింత కాన్ఫిడెన్స్ వచ్చింది. కంప్లీట్ క్లీన్ కామెడీతో రాబోతున్న చిత్రాన్ని ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని నమ్మకం ఉంది.  
మూవీ రిజల్ట్ ఎలా ఉన్నా సరే.. ప్రొడక్షన్ పరంగా 100 మందికి హెల్ప్ చేశాననే హ్యాపీనెస్ ఉంది. తెలుగులో మరిన్ని సినిమాలు చేయడానికి కథలు ఉంటున్నాం. ఫస్ట్ సినిమా అనుభవం మాకు చాలా నేర్పించింది. ఇకపై ఇకపై చేసే సినిమాలకు గ్రౌండ్ వర్క్ లా ఉపయోగపడింది. ప్రతి చిత్రాన్ని కొత్త టీం తో నిర్మించాలనుకుంటున్నాం` అని నిర్మాతలు తెలిపారు.  

Also read: `జబర్దస్త్` రష్మితో పెళ్లి.. అమ్మాయిల హార్ట్ బ్రేక్‌ అయ్యే స్టేట్‌మెంట్‌ ఇచ్చిన సుడిగాలి సుధీర్‌..

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా